పెళ్లికి వెళ్లేవారు రొటీన్‌కు భిన్నంగా శారీ డిజైన్ ఎలా చేయించుకోవాలో మాట్లాడుకుందాం..

సాధారణంగా ‘పెళ్లి’పిలుపు రాగానే కంచి, బెనారస్, ధర్మవరం... అంటూ పట్టుచీరలు బయటకు తీస్తారు. ఇక నుంచి ఈ రెగ్యులర్ శారీస్‌ను పక్కన పెట్టి కొత్తగా కనిపించడానికి ట్రై చేయండి. అందుకు ఈ టిప్స్ ఫాలో అవండి.

కొత్త ప్లెయిన్ కంచి పట్టు శారీ తీసుకొని దానిపైన హెవీ కలంకారీ, ప్యాచ్‌వర్క్ చేయించండి. ప్యాచ్‌వర్క్‌పైన హెవీ స్టోన్ వర్క్స్ చేయించండి. మొన్నటి వరకు బ్రొకేడ్, ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌లు వేసుకున్నాం. ఈ శారీమీదకు స్టైలిష్‌గా కనిపించే ప్లెయిన్ బ్లౌజ్ ధరించి, హెవీ జ్యూయలరీ పెట్టుకోండి.


మంచి టెక్స్చర్ వున్న ప్లెయిన్ గోల్డ్ కలర్ శారీని ఎంచుకోండి. దానికి మంచి గ్యాదర్స్ ఉన్న గోల్డ్ కలర్ నెట్ బ్లౌజ్ ధరించండి.


మంచి ఫాలింగ్ ఉన్న ప్లెయిన్ శారీకి లేస్ ఫ్యాబ్రిక్‌తో నీ లెంగ్త్ కిందుగా అడ్డంగా ఫ్రిల్స్ కుట్టండి. ఈ శారీ రిసెప్షన్‌కు బాగుంటుంది. దీనికి ఆల్టర్‌నెక్ స్టైలిష్ స్పగెట్టి బ్లౌజ్ ధరించండి. 



హెవీ కంచిపట్టు చీర తీసుకొని దానికున్న పెద్ద బార్డర్‌ను తీసేయండి. ప్లెయిన్ సిల్క్ బార్డర్‌ను అటాచ్ చేసి, దానిపైన సన్నటి ఎంబ్రాయిడరీ బార్డర్ వేయండి.

ఫాలింగ్ ఉన్న హెవీ శారీకి కుచ్చిళ్లు సెట్ చేసుకొని దానిపైన స్టోన్స్ కాని, ముత్యాలు కాని కుట్టుకుంటే డిజైనర్ శారీలా ఉంటుంది.


ఏదైనా ఫాలింగ్ ఉన్న ప్లెయిన్ శారీకి పవిట మీద మెటల్ లేదా సిల్వర్ లేదా గోల్డ్‌ది పెద్ద బ్రోచ్ పెట్టుకుంటే స్పెషల్‌గా ఉంటుంది.


చిన్న బార్డర్ ఉన్న ప్లెయిన్ శారీ ఉంటే దానికి 6-7 అంగుళాలు ఉన్న గోల్డ్, సిల్వర్ ఏదైనా.. బెల్ట్‌ను ఎంపైర్ వెయిస్ట్ భాగంలో పెట్టుకోండి.


అంతేకాదు శారీ కట్టులో ఎక్స్‌పర్‌మెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఫుల్ లెంగ్త్ బ్లౌజ్‌లు వేసుకొని, పల్లూని డిఫరెంట్‌గా వేసుకోవచ్చు. దీని వల్ల మీ శారీ సింపుల్‌గా ఉన్నా పల్లూ వల్ల మీ లుక్ డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా కనపడుతుంది.


శారీస్ డిజైన్ చేసుకోవాలనుకుంటే డెరైక్ట్‌గా శారీని కొనుక్కోకుండా డ్రెస్‌కు వాడే మెటీరియల్‌ని ఉపయోగించండి. అప్పుడు మీ శారీ మీకు మాత్రమే ప్రత్యేకం అన్నట్టుగా ఉంటుంది. దీనికి మరేదైనా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉపయోగిస్తే.. వందమందిలో ఉన్నా మీ లుక్ భిన్నంగా, అందంగా ఉంటుంది.

శారీస్‌లో చాలా కట్‌వర్క్స్ చేసుకోవచ్చు. మెటాలిక్ లుక్ వచ్చేలా శారీస్‌కు, బ్లౌజ్‌లకు వర్క్ చేయించుకుంటే బాగుంటుంది.


వెస్ట్రన్ పార్టీలకు వెళితే ప్లెయిన్ శాటిన్ శారీ కట్టుకొని, గ్యాదర్స్ బ్లౌజ్ వేసుకొని, వెస్ట్రన్ బెల్ట్ పెట్టుకోండి. మీ లుక్ స్టైలిష్‌గా ఉంటుంది.


మీరు కట్టుకున్న శారీకి ఇంకా ఎక్కువ రిచ్ లుక్ ఉండాలనుకుంటే కుచ్చిళ్ల మీదుగా ఎంబ్రాయిడరీ చేసిన 5-6 అంగుళాల వెడల్పు బార్డర్ పై నుంచి కిందకు వదిలేసేలా సెట్ చేసుకుంటే ఇంకా రిచ్ లుక్ వస్తుంది. నచ్చిన సింపుల్ శారీని కట్టుకున్నప్పుడు హెవీ జ్యూయలరీని ధరించండి. కలర్‌ఫుల్‌గా కనిపిస్తారు.


మీ దగ్గర ఉన్న పాత చీరలకి ఎప్పటికప్పుడు బ్లౌజ్‌లను మారుస్తూ ఉండండి. బ్లౌజ్ మార్చడం వల్ల శారీకి కొత్త లుక్ వస్తుంది. 


జార్జెట్ బెనారస్‌లో షేడెడ్ ఇప్పుడు ఫ్యాషన్. అలాంటి వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని నచ్చిన కలర్స్‌తో డై చేయించుకుంటే లుక్ వెరైటీగా ఉంటుంది.

లంగా ఓణీ స్టైల్ శారీస్ ఎప్పుడూ ఫ్యాషన్‌లోనే ఉంటాయి. లంగా పార్ట్ ప్రింటెడ్, ఓణీ పార్ట్ ప్లెయిన్‌గా... ఓణీపార్ట్ ప్రింటెడ్, లంగా పార్ట్ ప్లెయిన్‌గా ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిల్స్ వరకు ప్రింటెడ్, మిగతా అంతా పెట్టుకొని, దానికి హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్ యాడ్‌చేయడం బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top