లంచ్ పూర్తి చేయగానే నిద్ర ముంచుకు రాకుండా ఉండటానికి కొన్ని సూచనలు

మధ్యాహ్నం లంచ్ చేయగానే నిద్ర ముంచుకొస్తోందని అనడం వింటుంటాం. ఇంట్లో ఉంటే పర్వాలేదు కానీ ఆఫీసులో కునికి పాట్లు పడుతుండటం ఇతరులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మనమై దురభిప్రాయం కలిగేలా చేస్తుంది. అందుకే లంచ్ పూర్తి చేయగానే నిద్ర ముంచుకు రాకుండా ఉండటానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు.

* ఆఫీసు భవనం చుట్టూ వేగంగా ఒక రౌండ్ నడవండి. కండరాలు అన్నీ కదలడం వల్ల శరీరం యాక్టివ్ అవుతుంది. మీ డెస్క్ దగ్గర నుంచి కదలడం వీలు కాదు అనుకుంటే కొన్ని డెస్క్ ఎక్సర్‌సైజులు చేయండి.

* మీ ఐపాడ్ ఆన్ చేసి ఉత్సాహపరిచే సాంగ్స్ వినండి. ఇన్‌స్ట్రుమెంటల్ వినియోగం ఎక్కువగా ఉన్న పాటలు, లవ్ సాంగ్స్‌ను దూరం పెట్టండి. హిప్ హాప్, రాక్ ఎన్ రోల్ మ్యూజిక్‌ను వినండి.

* నిద్ర వస్తుంది కదా అని కడుపు నిండా కాఫీ తాగడం మంచి ఆలోచనకాదు. కానీ గ్రీన్ టీ తాగొచ్చు. గ్రీన్ టీ వల్ల యాంటీఅక్సిడెంట్లు లభిస్తాయి. శరీరం ఉత్సాహపూరితమవుతుంది.


* చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. నిద్ర ఇట్టే మాయమవుతుంది.

* మీ డెస్క్ దగ్గర చిందరవందరగా ఉన్న వస్తువులను తొలగించండి. డెస్క్‌ను నీట్‌గా ఉంచుకోండి. లంచ్ తర్వాత చేయాల్సిన పనులను ఒక పేపర్‌పై రాసి ఎదురుగా పెట్టుకోండి. లేజీనెస్ దూరమయి పని చేయాలనే ఉత్సాహం వస్తుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top