
యాపిల్...
కావలసిన పదార్థాలు:
యాపిల్ ముక్కలు - కప్పున్నర, పుచ్చకాయ ముక్కలు - నాలుగు, అరటిపండు ముక్కలు - ఐదు, పిస్తా పప్పులు - ఆరు, పాలు - ఒక కప్పు, పంచదార - పావు కప్పు, తేనె - ఒక టేబుల్ స్పూను.
తయారుచేయు విధానం:
ముందుగా కొన్ని యాపిల్ ముక్కల్ని మెత్తగా మిక్సీవేసి
పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మిగతా యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు,
అరటిపండు ముక్కలు వేసుకోవాలి. పాలు కాచుకుని అందులో పంచదార, తేనె వేసి బాగా
కలిపి పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారాక పాలను పండ్ల ముక్కల్లో పోయాలి.
యాపిల్ ముక్కల గుజ్జుని కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పది
నిమిషాల తర్వాత తింటే కడుపులో చల్లగా బాగుంటుంది.పుచ్చకాయ...

కావలసిన పదార్థాలు:
పుచ్చకాయ ముక్కలు - పది, స్ట్రాబెర్రీలు - రెండు, ద్రాక్ష పండ్లు - అర కప్పు, డ్రైఫూట్స్ - రెండు టేబుల్ స్పూన్లు. తయారుచేయు విధానం:
ఒక ప్లేటు చుట్టూరా పెద్దసైజు పుచ్చకాయ ముక్కల్ని పెట్టి మధ్యలో ద్రాక్షపండ్లు, స్ట్రాబెర్రీ ముక్కలు, డ్రైఫూట్స్ వేయాలి. దీన్ని పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టి తీసి పండ్ల ముక్కలపై ఉప్పు, పెప్పర్ చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
మిల్క్ మిక్స్...

కావలసిన పదార్థాలు:
పాలు - ఒక కప్పు, అరటిపండ్ల ముక్కలు - అర కప్పు, నల్ల
ద్రాక్ష పండ్లు - ఐదు, పైనాపిల్ ముక్కలు - నాలుగు, గ్రీన్ యాపిల్ ముక్కలు -
ఐదు, రెడ్ యాపిల్ ముక్కలు - నాలుగు, పంచదార - అర కప్పు, ఐస్ క్రీము - పావు
కప్పు.
తయారుచేయు విధానం:
పాలను బాగా కాచి చల్లారిన తర్వాత పంచదార వేసి బాగా
కలపాలి. తర్వాత పండ్ల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. దీనిపై ఐస్‌క్రీము,
తేనె వేసి బాగా మళ్లీ కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. బాగా చల్లబడిన తర్వాత
తీసి తినాలి.