వెక్కిళ్లు వచ్చినపుడు అవి పోవడానికి చేయాల్సిన కొన్ని చిట్కాలు

- వెక్కిళ్లను పోగొట్టడానికి ప్రశాంతంగా కూర్చుని శ్వాసను దీర్ఘంగా తీసుకుని విడిచిపెడుతుండాలి. ఇలా కొంత సేపు చేస్తే వెక్కిళ్లు వాటంతటవే పోతాయి.

- ఆపకుండా కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని గటగటా తాగేయాలి.

- వెక్కిళ్లు వచినపుడు నోట్లో కొంచెం చక్కెర లేదా తేనె వేసుకుని చప్పరించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

- నిమ్మపండును సగం కోసి ఆ బద్దలోని రసాన్ని నోట్లో పిండుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

అయితే ఈ చిట్కాలు పనిచేయకపోగా వెక్కిళ్లు ఆగకుండా ఎక్కువ సేపు ఉంటేమాత్రం వైద్యుడిని సంప్రదించడం మంచిది. అవసరాన్ని బట్టి రక్త పరీక్షలు, ఇసిజి, ఛాతీ ఎక్స్‌రేలను తీయాల్సి ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top