కడుపులో చేరే అనేక క్రిముల వల్ల నీళ్ల విరేచనాలు, డయేరియా వంటి సమస్యలు కనిపిస్తాయి.సాధారణంగా కడుపులో, పేగుల్లోకి చేరడానికి అవకాశం ఉన్న సూక్ష్మజీవులివి... వీటి గురించి తెలుసుకుందాం

కడుపులో చేరే అనేక క్రిముల వల్ల నీళ్ల విరేచనాలు, డయేరియా వంటి సమస్యలు కనిపిస్తాయి. రకరకాల జీవులతో ఈ సమస్య రావచ్చు. సాధారణంగా కడుపులో, పేగుల్లోకి చేరడానికి అవకాశం ఉన్న సూక్ష్మజీవులివి...
 

బద్దెపురుగులు :
 ఇవి సరిగా ఉడికించని పోర్క్ వంటి ఆహారం వల్ల కడుపులో చేరే పరాన్న జీవులు. ఈ తరహా జీవులు ప్రధానంగా ఫ్లాటీహెల్మింథిస్, నిమాటీ హెల్మింథిస్ జాతికి చెందినవై ఉంటాయి. ఇందులో నులి పురుగు లేదా ఆస్కారిస్ వార్మ్స్ ఉంటాయి. అవి ప్రధానంగా చిన్న పేగుల్లో ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీరు, సరిగా వండని ఆహారంతో ఈ క్రిములు వాపిస్తాయి.
 

పిన్ వార్మ్ లేదా త్రెడ్ వార్మ్ లేదా సీట్ వార్మ్: 
ఇవి నిమటొడా వర్గానికి చెందిన జీవులు. మలద్వారం దగ్గరలో ఉండి దురదను పుట్టిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టిలో తమ మర్మావయవాల వద్ద గోకి మళ్లీ వేళ్లు నోట్లో పెట్టుకోవడం వల్ల ఇవి వ్యాపిస్తాయి. 


హుక్ వార్మ్ (ఎన్‌కైలోస్టోమా):
 ఇవి కూడా నిమటోడా వర్గానికి చెందినవే. ఇది చర్మం ద్వారా శరీరంలోకి పొడుచుకుని వెళ్ళి, రక్తనాళాల ద్వారా కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలో వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంది. 


ఎంటమీబా :
 ఇది ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
జియార్డియా వంటి ఏకకణ జీవులు పొట్టలోకి, రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరమంతటా దురదలు పుట్టిస్తాయి.
 

క్రిములతో కనిపించే లక్షణాలు
నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆహారం తీసుకుంటున్నా బరువు తగ్గిపోతూ ఉండటం, విరేచనాలలో రక్తం, పురుగులు కనిపించడం, మర్మావయవాల వద్ద దురద, శ్వాసలో దుర్గంధం, కళ్ళ చుట్టూ నల్లటి చారలు, చిన్న పిల్లల్లో ముఖంపై తెల్ల మచ్చలు రావడం అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావడం, దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, మూత్రంలో రక్తం పోవడం, చర్మానికి సంబంధించి దద్దుర్లు రావడం, అనీమియాకు గురికావడం, నిద్రలో ఉన్నప్పుడు పళ్ళు కొరకడం.
కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కడుపులోకి పురుగులు ఎలా చేరతాయి...

పురుగులు వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారం. సరిగ్గా ఉడికించని మాంసం తినడం, ఆకుకూరలు, కూరగాయలు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల చాలా సూక్ష్మక్రిములు కడుపులోకి చేరతాయి.
కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరగడం వల్ల హుక్ వార్మ్‌వంటి పురుగులు వ్యాప్తి చెందుతాయి.
 

కడుపులో పురుగుల నివారణకు ఆహారనియమాలు:
తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పళ్లు, క్యారట్ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా తేనె, పుప్పొడి పండ్ల విత్తనాలు శరీరంలో పురుగులను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే బవెల్ కదలికలు సరిగ్గా ఉండాలి. అప్పుడే విరేచనాల ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి ఇందుకు దోహదపడే విధంగా మంచినీరు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
ఆహారం జీర్ణం అవ్వడంలో తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్-సి, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
కలుషితమైన నీళ్లను తాగకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top