వేసవికాలం వచ్చిందంటే చాలు భగ భగ మండే సూర్యుడు మనపై ప్రతాపం చూపుతాడు. మండే ఎండ బారి నుంచి రక్షణ పొందాలంటే కొన్ని రకాల ముందుజాగ్రత్తలు.

వేసవికాలం వచ్చిందంటే చాలు భగ భగ మండే సూర్యుడు మనపై ప్రతాపం చూపుతాడు. మండే ఎండ బారి నుంచి రక్షణ పొందాలంటే కొన్ని రకాల ముందుజాగ్రత్తలు తప్పవని అంటున్నారు నిపుణులు. ప్రతి ఏటా మన దేశంలోనూ లక్షలాదిమంది స్కిన్ క్యాన్సర్‌ల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవికాలంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తీవ్ర ఎండలో హానికరమైన యూవీ కిరణాలు నేరుగా మీ శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారంటున్నారు.
శరీరాన్ని కప్పి ఉంచండి
ఎండలో బయటకు వెళ్లేటపుడు తలకు టోపి ధరించాలి. కాళ్లు, చేతులు మొత్తం శరీరం కప్పి ఉంచేలా దుస్తులు ధరించటంతో పాటు ఎండ వేడిమి బారినుంచి రక్షణకు ఓ గొడుగును తీసుకెళితే మంచిది. మీ శరీరానికి అలోవీరా జెల్ రాసుకుంటే అది యాంటీ ఇన్‌ఫ్లేమటరీ లాగా పని చేస్తుంది.
కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్
ఎండలో వెళ్లేటపుడు మీ కళ్లకు రక్షణగా సన్‌గ్లాసెస్‌ను వాడితే మంచిది. సూర్య కిరణాలు కళ్లలోకి పడితే కాటారాక్టు, గ్లూకోమా లాంటి కంటి జబ్బులు వచ్చే ప్రమాదముంది. యూవీ కిరణాలు మీ కళ్లపై పడకుండా ఉండటంతోపాటు మీ కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మీరు సన్ గ్లాసెస్‌ను ఎంపిక చేసుకునేటపుడు బ్లాక్ కలర్‌తోపాటు పెద్దసైజువి ఎంపిక చేసుకోవటం మేలు.
వడదెబ్బ నుంచి...
వేసవికాలంలో ద్రవ పదార్థాలు తగిన మోతాదులో తీసుకోకుంటే ఆరోగ్య సమస్యలతోపాటు ప్రాణానికి ప్రమాదం. వడదెబ్బతో పల్స్‌రేట్ పెరిగి, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. వేడి బారి నుంచి రక్షణ పొందటానికి కూలర్ కింద నీడపట్టున ఉండాలంటారు. ఎండలో తిరిగే వారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

ఈశరీరానికి నీరిచ్చే పుచ్చకాయ లాంటి ఆహారంతోపాటు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మీకు సోడా తాగే అలవాటుంటే ప్రిజ్ వాటర్‌కు ప్రత్యామ్నాయంగా సోడా తాగవచ్చు.

ఈమీరు వ్యాయామం చేసేటట్లయితే దానికి ముందు ఎక్కువ నీరు తాగటం మంచిది. మీరు విమాన ప్రయాణం చేస్తున్నట్లయితే అధికంగా నీరుతాగటం మర్చిపోవద్దు.
 

ఈమీరు ఆఫీసులో పనిచేస్తున్నా అధిక నీరు తాగటంతోపాటు మీ వెంట నీళ్లబాటిల్ ఉంచుకోవటం మేలు. మీరు ఆహారం తీసుకునే ముందు నీళ్లు తాగటం మంచిది. ఈఎండ వేడిమి వల్ల మీ శరీరంపై చెమటకాయలు వచ్చే అవకాశముంది. దీని బారి నుంచి రక్షణ పొందటానికి వేసవిలో ప్రీక్లీహీట్ పౌడరును వాడితే మంచిది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top