తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి.

తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి.
 

తలనొప్పి రావడం లేదా? అయితే భవిష్యత్తులో తలనొప్పులను నివారించడానికి ఇదే జాగ్రత్తలు తీసుకోండి. తలనొప్పి తగ్గించేందుకు డాక్టర్లు చేసే కొన్ని సూచనలు ఇవి...
 

- కంప్యూటర్ వర్క్ చేసే సమయంలో ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు. కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్లు చేస్తూ కంటిని ఒత్తిడికి గురి చేసేవారు పనిలో తరచూ బ్రేక్ తీసుకోవడం అవసరం.
 

- పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. రోజూ ప్రశాంతంగా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది.
 

- పడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి. ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి. కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం మానేయాలి. ఏదైనా అలవాటు... తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి చేయడం సరికాదు. ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్‌ఫ్యూమ్స్‌ను వాడటం సరికాదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top