నిద్ర సమయంలో మంచి తలగడ, పరుపు ఎలా ఉండాలంటే...?

చాలామంది నిద్ర సమయంలో తలగడ వాడకపోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని అంటారు. స్నేహితులకు కూడా అదే సలహా ఇస్తుంటారు. నిజానికి మంచి నిద్ర కోసం సరైన తలగడ వాడాలి. బహుశా మనిషి ముందుగా కనుగొన్న వస్తువుల్లో తలగడ కూడా ఒకటి. నాగరకత అభివృద్ధి చెందని సమయంలోనూ మానవులు నిద్ర సమయంలో తమ తలను శరీరానికి తగినట్లు ఉంచుకోవడం కోసం తమ భుజాన్నో, చెట్టు మొదలునో ఉపయోగించేవారు. చాలామంది ఒక పక్కకు ఒరిగి భుజం మీద పడుకుంటుంటారు. ఒక రాత్రి నిద్రలో కనీసం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది.

అలా పక్కకు తిరిగి పడుకున్న సమయంలో తలకూ, పడకకూ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌ను అలాగే ఉంచి రాత్రంతా నిద్రపోవడం ఎవరికీ సాధ్యం కాని విషయం. అందుకే మంచి తలగడను ఉపయోగించడం అవసరం. అయితే ఎంత మంచి తలగడనైనా రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత తలగడ తన కంప్రెస్సబిలిటీ కోల్పోతుంది. అందుకే కొందరు తలగడ ఉన్నా దాని సపోర్ట్ సరిపోక మళ్లీ భుజాన్ని వాడుతుంటారు.


మంచి తలగడ ఎలా ఉండాలంటే... 

తలగడ మృదువుగా భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి.
కుటుంబంలో ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. పిల్లలకు కూడా వాళ్ల తలగడ వాళ్లకే వేరుగా ఉండేలా చూడాలి. స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువుగా ఉండేలా తలగడను ఎంచుకోవాలి.

ఇక పడక విషయానికి వస్తే...


చాలా మంది పడుకునే సమయంలో పరుపు మీద పడుకోవడం మంచిది కాదని అంటారు. వీపునొప్పితో బాధపడే చాలా మంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని అంటుంటారు. ఇది సరికాదు. నిజానికి మంచి పరుపు మీద పడుకోవడమే మంచిది. అది శరీరానికి ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగా ఉండాలి. అదే సమయంలో మనం అందులోకి మరీ కూరుకుపోయేలా అది ఉండకూడదు. నిపుణులు చెప్పే ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని అపోహ పడుతుంటారు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంటిలో చాలా భాగాల్లో నొప్పి వస్తుంది.

  

అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపును తీసుకోవాలి. ఒక పరుపును రెండు నుంచి మూడేళ్ల పాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత మార్చడమే మంచిది. పరుపు వాడే సమయంలోనూ ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన స్థితిస్థాపకతను కోల్పోతుంది. ఇక ఒక పరుపును కొన్న తర్వాత రెండు మూడేళ్లు వాడకుండా ఉంటే... దాన్ని ఇక వాడకపోవడమే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top