తొక్కే కదా అని తీసిపారేస్తే... మీరెంతో నష్టపోవాల్సి వస్తుందట.

వేసవిలో పుచ్చకాయను చల్లచల్లగా లాగించని వారు ఉండరు. పుచ్చకాయ ముక్కల్నే కాకుండా దాని గింజల్ని సలాడ్ డెకరేషన్‌లో వాడతారు కొందరు. మరికొందరు వాటిని పొడి చేసుకుని తింటారు. కాని పుచ్చకాయ తొక్కను మాత్రం పనికిరాదని చెత్త బుట్టలో పారేస్తుంటారు. అయితే ఇలా తొక్కే కదా అని తీసిపారేస్తే... మీరెంతో నష్టపోవాల్సి వస్తుందట. తినడానికి పనికిరాదని పారేసే ఆ తొక్కలో ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఎంత పోషకాలున్నా తొక్కను ఎలా తింటారంటూ ముఖం తిప్పుకోకండి. దాన్ని రుచిగా తినాలంటే చట్నీ చేసుకోవాలి అంటున్నారు వాళ్లు. అదెలాగంటే...

తయారీ: 

పుచ్చకాయని కోసి అందులో ఉండే ఎర్రటి గుజ్జు భాగాన్ని తీసేయాలి. తరువాత ఆకు పచ్చటి భాగాన్ని పైపైన పీలర్‌తో చెక్కిన తరువాత పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్స్‌లా కోసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో క్యూబ్స్‌గా కోసుకున్న పుచ్చకాయ ముక్కలు మూడు కప్పులు, అర కప్పు పంచదార, కాస్త ఎక్కువ మోతాదులోనే తురిమిన అల్లం, పచ్చిమిర్చి - వెల్లుల్లి ముక్కలు ఒక్కో టేబుల్ స్పూను, అరకప్పు వెనిగర్, అర కప్పు నీళ్లు, మూడు మిరియపు గింజలు (నలిపి), అర టీస్పూను ఉప్పు వేసి కలపాలి.

ఆ తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మంట మరీ ఎక్కువ, తక్కువ కాకుండా కాసేపు ముక్కల్ని ఉడికించాలి. పంచదార కరిగే వరకు గరిటెతో కలియపెడుతూనే ఉండాలి. పంచదార కరిగిన తరువాత సన్నటి మంటపై యాభై నిముషాల పాటు ఉంచి గిన్నె దింపేయాలి. చల్లారిన తరువాత గాలి చొరబడని డబ్బాలో ఉడికించిన పుచ్చకాయ మిశ్రమాన్ని పోసి ఫ్రిజ్‌లో ఓ రెండు రోజుల పాటు ఉంచాలి. ఈ పుచ్చకాయ తొక్క చట్నీని మీకు నచ్చిన వంటకంతో జతచేర్చి తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top