వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వేసవిలో సాధారణంగా నీరు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. కానీ నీరు తీసుకుంటే సరిపోతుందా? ఏ ఆహారం తీసుకుంటే శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేసవిలో అనుసరించాల్సిన ఆహారప్రణాళికను తెలియజేయండి - నాయుడు, హైదరాబాద్ వేసవికాలంలో ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుంది కాబట్టి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆ లోటును పూరించుకోవచ్చు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాట్ తక్కువగా ఉండే డైట్‌ను తీసుకోవాలి. బట్టర్‌మిల్క్ బాగా ఉపకరిస్తుంది. కొందరికి గంటకొకసారి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. వేసవిలో ఈ అలవాటును తగ్గించుకుని కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ తీసుకోవాలి. కాఫీ,టీలు ఎక్కువగా తీసుకోవడం ఏ కాలంలోనైనా మంచిది కాదు.

ఏ డ్రింక్ తీసుకున్నా షుగర్ శాతం తక్కువగా ఉండేలా చూసుకుంటే చాలు. వేసవిలో మేలు చేసే మరో ఫ్లూయిడ్ కొబ్బరి నీరు. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. డీహైడ్రేషన్‌కు లోను కాకుండా కాపాడతాయి. ఎండాకాలంలో పండ్లరసాలు, సలాడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు జ్యూస్ రూపంలో తీసుకున్నా, నేరుగా తిన్నా పర్వాలేదు. పండ్లలో 75 నుంచి 80 శాతం నీరు ఉండటమే కాకుండా మైక్రోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top