థైరాయిడ్‌పై అపోహలు

థైరాయిడ్ గ్రంధి మెడకు కింది భాగంలో ఉంటుంది. మెడ వాచినా ఊబకాయం వచ్చినా, వణుకుడు రోగం వచ్చినా, అది థైరాయిడ్ ప్రోబ్లమ్ అనుకుంటూ వుంటారు. చాలా వ్యాధులకు ‘థైరాయిడ్‌’ కారణం అని అపోహపడుతూ వుంటారు. అందుకే థైరాయిడ్ గురించి క్షుణ్ణంగా తెల్సుకోవాలి.
*ఈ గ్రంథి ఎండోక్రైన్ గ్రంథి. అంటే హార్మోన్లు ఉద్భవిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు శరీరానికి వేడిని ఇస్తాయి. కొవ్వును కరిగిస్తాయి. శారీరక, మానసిక పెరుగుదలకు ఇవి అత్యంత అవసరం.
*కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి మెడ కిందుగా వుండక, వేరేగా అంటే నాలుకలోనో, మెడలోపలి భాగంలోనో వుండొచ్చు.
*మెదడు నుంచి వచ్చే హార్మోన్లు ఈ గ్రంథిని ప్రభావితం చేస్తాయి. మెదడు ప్రభావితంగా వుందా? లేదా? అన్న విషయం మనకు కేవలం థైరాయిడ్ గ్రంధిని చూస్తే తెలుస్తుంది. ఈ గ్రంథి వాచినట్లయతే అది దాని తప్పు కాదు.. మెదడు స్రావకాల్లో లోపం వుండొచ్చు.
* జ్ఞాపకశక్తి క్షీణించడం, నీరు పట్టి బరువు పెరగడం, బిపి, గుండె కొట్టుకోవడం స్థిరంగా వుండకపోవడం, అలసటవచ్చినట్లు అనిపించడం ఇత్యాది లక్షణాలన్నీ వుంటే థైరాయిడ్ ప్రోబ్లమ్‌గా గుర్తించవచ్చు. దీంట్లో గ్రంథికి వాపు రావల్సిన అవసరం లేదు.
*గ్రంథి సరిగ్గా పనిచెయ్యకపోవడం అనేది దాదాపు చిన్న పిల్లలు, యుక్తవయస్సు స్ర్తిలలో జరుగుతుంది. శరీరంలో వాపు, గొంతు బొంగురు పోవడం, కొలెస్టరాల్ శాతం పెరగడం.. చిన్నపిల్లల్లో ‘మందమతులు’ తయారవుతారు. వీరికి థైరాక్సిన్ టాబ్లెట్‌లు ఇస్తే సరిపోతుంది.

*థైరాయిడ్‌ ప్రభావానికి స్ర్తిలు ఎక్కువగా గురవుతారు. ఋతుచక్రం వుండటంవల్ల వారికే ఎక్కువవస్తుంది. థైరాక్సీన్ హార్మోన్ సరిగ్గా లేకపోతే అబార్షన్లు జరుగుతాయి. అంటే దానర్థం అబార్షన్లు జరిగే స్ర్తిలకు థైరాయిడ్ ప్రోబ్లమ్ ఒక్కటే వుందని కాదు.
*తల్లికి థైరాయిడ్ ప్రాబ్లమ్ వుంటే పుట్టే శిశువులకూ గ్రంథి వాపు రావచ్చు. కాని అది త్వరగానే తగ్గిపోతుంది. భయపడాల్సిన పనిలేదు. దానే్న నియోనేటల్ గాయిటర్ అంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top