పొద్దున నడకతో వచ్చే లాభాలు

పొద్దునే్న నడిస్తే ఎన్నో లాభాలున్నాయ అంటున్నారు వాకింగ్ వీరులు. వారు చెప్పేవి నిజమేనంటున్నారు వైద్యులు. పొద్దున నడకతో వచ్చే లాభాలను చూసి మీరు నడకను మొదలుపెట్టి అందుకోండి లాభాల భాండాగారాన్ని.
* నడకతో కండరాలు బలపడి నిగారింపు సంతరించుకొంటాయ. ఊబకాయమూ తగ్గుతుంది. సరియైన అవయవాల పొందిక వల్ల చక్కగా కనిపించడమేకాదు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంటారు.
* నడకతో చెమట పట్టడంవల్ల కొవ్వు కరిగి నీరుగా మారుతుంది. గుండె, ఊపిరితిత్తులు బలంగా మారి వొంట్లో శక్తి నిల్వలు పెరుగుతాయి.
* ఎముకలు గట్టిగా తయారవుతాయి. కాల్షియం కోల్పోయి ఎముకల సాంద్రత తగ్గడం ఆగిపోతుంది. రాత్రిపూట గాఢనిద్రపోవచ్చు.
* శరీర భాగాలలో అదనంగా పేరుకొన్న కొవ్వు కరిగిపోతుంది.
* ఒత్తిడి , డిప్రెషన్ దూరమవుతాయ. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సమస్యలను సత్వరం పరిష్కరించుకొనే వీలు కలుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top