ముఖంపైన అమ్మవారు మచ్చలు... తగ్గేదెలా?

సాధారణంగా అమ్మవారు పోసినప్పుడు పడ్డ మచ్చలు కొద్దికాలం తర్వాత వాటంతట అవే చర్మం రంగులో కలిసి పోతాయి. అయితే కొంతమందికి ఈ గుల్లలు భరించలేనంత దురదగా ఉంటాయి. ఆ దురదను తట్టుకోలేక గోకటం లేదా చిదమటం చేస్తారు. దాని వల్ల ఆ పుండులో నుంచి రసి కారి, మిగిలిన ప్రదేశాలకు కూడా వ్యాపించడమే కాక ఇన్ఫెక్షన్ ఏర్పడి మచ్చలు పడతాయి. అందువల్లనే డాక్టర్లు మొటిమలను, గుల్లలనుగిల్లటం, చిదమడం వంటి పనులు చేయరాదని చెబుతారు. మచ్చలను తగ్గించే కొల్లాజెన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల అప్పటి మచ్చలు అలాగే ఉండి పోతాయి. 


లేజర్ చికిత్సావిధానంలో కొల్లాజెన్ ఏర్పడేటట్లు చేయడం ద్వారా మచ్చలు పడ్డ చోట్ల కొత్త చర్మం పుట్టేటట్లు చేయడం ఒక పద్ధతి అయితే, మచ్చలు పడిన ప్రదేశంలోని చర్మపు పై పొరలను తొలగించి, అక్కడ కొల్లాజెన్ ఉత్పత్తయేలా చేయడం ద్వారా కొత్త చర్మం పెరిగేలా చేయడం మరోపద్ధతి. మరో పద్ధతి ఏమిటంటే మచ్చల తీవ్రతను తగ్గించటం ద్వారా అవి క్రమంగా చర్మంలో కలిసిపోయేటట్లు చేయడం. ఇవన్నీ సురక్షితమైన చికిత్సావిధానాలే. అన్ని చర్మతత్వాల వారికీ ఈ చికిత్సను చేయవచ్చు. లేజర్ విధానంతో బాటు మరింత అధునాతనమైన ఇతర చికిత్సా విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి.  మంచి డెర్మటాలజిస్‌్తను సంప్రదించి, మీకు అనుకూలమైన పద్ధతిలో మచ్చలను నయం చేసుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top