ఇన్సూరెన్స్‌కు ముందు మూడు మాటలు

1 minute read
మనం భరించలేనివి రెండే రెండు. ఒకటి విద్యకయ్యే ఖర్చు. రెండు వైద్యాని కయ్యే ఖర్చు. విద్యకు వేరే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా ఖర్చుపెట్టా ల్సిందే. కానీ జాగ్రత్తపడితే వైద్య ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. మీ కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే వైద్య ఖర్చుల వల్ల పేదల జాబితాలోకి మారే వారిలో మీరూ ఒకరు కాకుండా చూసుకోవచ్చు.

వైద్య బీమా చేయించుకునేటప్పుడు చేయాల్సిన పని ఏయే వ్యాధులకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుందో తెలుసుకోవడం. మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందో లేదో చూసుకోండి.

మీరు ఏ కంపెనీలో వైద్య బీమా తీసుకుంటున్నారో ఆ కంపెనీ పనితీరు తెలుసుకోండి. వైద్య ఖర్చులు చెల్లించేటపుడు ఇబ్బంది పెట్టకుండా సులువుగా చెల్లిస్తుందో లేదో కనుక్కోండి.

తగినంత ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చూసుకోండి. అంటే లక్ష రూపాయలకు వైద్య బీమా చేయించడం పెద్దగా పనికిరాకపోవచ్చు. కనీసం మూడు లక్షలకు చేయిస్తే మంచిది. వారసత్వంగా వచ్చే వ్యాధులేమైనా మీ పెద్దలకు ఉంటే వాటి వైద్య ఖర్చులకు అను గుణంగా (ఒకవేళ మీకూ వస్తే ఎంతవుందన్న అంచనాతో) బీమా చేయించుకోవడం అవసరం. వీలైతే మీకు, మీ భార్యకు వేర్వేరు పాలసీలు చేయించడం మంచిది.

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top