సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రం గోవా విశేషాలు తెలియచేయండి?

మనదేశంలో ఉన్న సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలలో ‘గోవా’ ఒకటి. రోజూ వేలాదిమంది దేశవిదేశీ పర్యాటకులు సందర్శించే ఈ రాష్ట్రం దేశంలోని అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటి. ప్రకృతి అందాలకు పుట్టినిల్లయిన ఈ రాష్ట్రంలో అందమైన బీచ్‌లు, విలాస ప్రాంతాలను చూడవచ్చు. ‘గోవా’ రాష్ట్ర రాజధాని ‘పనజి’. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటుచూసినా తాటి, ఈత చెట్లు కనిపిస్తాయి. మాండోవి నదీప్రవాహం సముద్రంలో కలిసే చోట గస్సార్ డియాస్, డోనాపావు అనే బీచ్‌లు ఉన్నాయి. పనజికి పదికిలోమీటర్ల దూరంలో అగ్వాడా కోట ఉంది.

ఇది 460 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వాళ్లు నిర్మించినది. దీని పరిసరాల్లో వందలకొద్దీ ఫలపుష్పజాతులతో అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. పురావస్తు ప్రదర్శనశాల, గ్యాలరీలు ఉన్నాయి. పనజికి 15 కి.మీల దూరంలో ‘కాలంగూట్’ ప్రాంతంలో అందమైన బీచ్ ఉంది. పనజికి ఏడుకిలోమీటర్ల దూరంలో ‘డన్ పౌల్’ ఉంది. ఇది మంచి పిక్నిక్‌స్పాట్. ఇంకా పనజి పరిసర ప్రాంతాల్లో ‘వేళ, వెగతార్, మపుకు, బోయ్‌జీసస్’ తదితర సుందర ప్రదేశాలెన్నో ఉన్నాయి. వేసవికాలం ఆనందంగా గడపాలనుకునే వారికి గోవా చక్కటి పర్యాటక ప్రదేశం. మనదేశానికి వచ్చిన ప్రపంచపర్యాటకులలో దాదాపుగా ఎవరూ గోవాను దర్శించకుండా తిరిగి వెళ్లరు. ఇక్కడ బస చేయడానికి అందమైన రిసార్టులు, అధునాతన హోటళ్లు ఉంటాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ప్రవేశించి అక్కడి నుంచి సులువుగా గోవాకు చేరుకోవచ్చు. గోవాకు విమాన సర్వీసులు కూడా ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top