రోజూ ఎక్సర్‌సైజులు చేసేవారు అకస్మాత్తుగా వ్యాయామం ఆపేస్తే.....

రోజూ ఎక్సర్‌సైజులు చేసేవారు అకస్మాత్తుగా వ్యాయామం ఆపేస్తే.. వారి శరీరంలోని కండర కణాలు కొవ్వు కణాలుగా మారిపోతాయని, అందుకే వారు త్వరగా లావెక్కుతారని చాలా మంది భావిస్తుంటారు. కానీ వాస్తవమేంటంటే..
కండరాలు, కొవ్వులు రెండూ వేర్వేరు రకాల కణాలతో తయారవుతాయి. వాటి విధులూ వేర్వేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి కసరత్తులు చేసినప్పుడు అతడి శరీర కండర కణాలు వ్యాకోచించి పరిమాణం పెరుగుతాయి. అంతేతప్ప కొత్తగా కండరాలు పుట్టుకురావు. ఆ త ర్వాత అకస్మాత్తుగా వ్యాయామం ఆపేసినప్పుడు కండర కణాలు అదృశ్యమవడం గానీ లేదా కొవ్వు కణాలుగా మారడం గానీ జరగదు.

అవి కేవలం కుంచించుకుపోయి పరిమాణంలో చిన్నగా మారతాయంతే. సాధారణంగా ఒక కిలో కండర కణాలు ఒక రోజుకు 13 క్యాలరీల శక్తిని వినియోగించుకుంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాళ్లు సహజంగానే ఎక్కువగా తినడానికి అలవాటుపడతారు. అయితే అకస్మాత్తుగా ఎక్సర్‌సైజులు ఆపేయగానే వారి కండరాలకు అవసరమైన శక్తి పరిమాణం తగ్గిపోతుంది. 


అయినా వారు తినే తిండి పరిమాణం మాత్రం అంత త్వరగా తగ్గిపోదు. దీంతో తీసుకునే ఆహారం, ఖర్చయ్యే శక్తికి మధ్య వ్యత్యాసం ఏర్పడి సహజంగానే వారిలో అతి త్వరగా కొవ్వు పెరిగిపోతుంది. అంతేతప్ప... కండర కణాలు మాత్రం కొవ్వు కణాలుగా మారవు!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top