సుప్రసిద్ధ పర్యాటక క్షేత్రం ‘అక్క మహాదేవి గుహలు’ ఎక్కడ ఉన్నాయి?


అక్క మహాదేవి గుహలు శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల నుంచి పదికిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 12 కి.మీల దూరం. ఈ గుహలకు రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటి ముందు భాగంలో సహజంగా ఏర్పడిన శిలలు, లోపలి భాగంలోని శిలాకృతులు విచిత్రంగా ఉంటాయి. కుడివైపు ద్వారం నుంచి వెళ్తే గుహ చివరకు చేరవచ్చు. సొరంగం వంటి ఈ దారి సహజ సిద్ధంగా ఏర్పడినది. ఈ దారి వంపులు తిరుగుతూ దాదాపుగా 250 మీటర్ల పొడవు ఉంటుంది. గుహ చివరి అంచులో వేదిక మీద శివలింగం ఉంది. ఇది సహజలింగం. శివుని భక్తురాలు అక్కమహాదేవి ఈ లింగాన్నే పూజించిందట, అందుకే ఈ గుహలకు అక్క మహాదేవి గుహలు అనే పేరు. ఆలయ ప్రాంగణంలో అక్కమహాదేవి విగ్రహం ఉంది. 

చారిత్రక ఆధారాల ద్వారా ఇది ఆదిమానవుడు నివసించిన ప్రదేశం అని తెలుస్తోంది. ఈ గుహల దగ్గర కాపాలిక విగ్రహం ఉంది.
ఇక్కడ ఉన్న సహజతోరణం మరో ప్రకృతి అద్భుతం. ఇది భూమికి రెండు వందల అడుగుల ఎత్తులో ఏర్పడిన రాతితోరణం.
ఈ గుహలను చేరడానికి పాతాళగంగ మెట్ల నుంచి కానీ, శ్రీశైలం మెట్ల నుంచి కానీ కృష్ణానదిలో ప్రయాణించాలి.
శ్రీశైలానికి వాయువ్య దిశలో ఉన్న పంచమఠాల నుంచి చుక్కల పర్వతం చేరి అక్కడి నుంచి జాతర రేవు, బుగ్గవాగు మీదుగా ఈ గుహలను చేరవచ్చు.
శ్రీశైలం - హైదరాబాద్ రోడ్డులో 44 కి.మీ ప్రయాణించి, అక్కడినుంచి ఎడమవైపుకు సుమారు 12 కి.మీ వెళ్లితే ఈ గుహలను చేరవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top