పిల్లల్లో అనేక కారణాల వల్ల అరచేతులు లేదా అరికాళ్లలో విపరీతంగా దురద
రావడంతో పాటు చర్మం ఊడిపోవడం జరుగుతుంటుంది. ఎగ్జిమా, హైపర్‌కెరటోటిక్
పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్‌ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్,
కాన్‌స్టిట్యూషనల్ డిసీజెస్, స్ట్రెస్, కొన్ని కొన్ని సిస్టమిక్ వ్యాధులు
ఉన్నప్పుడు, సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్, కొన్ని సందర్భాల్లో విటమిన్
లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు
చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సాధారణంగా ఇన్ఫెక్షన్స్, మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాత కొందరు పిల్లల్లో ఈ విధమైన లక్షణాలను చూస్తుంటాం. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్‌లాగా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ సోకిన తర్వాత వచ్చే ఈ ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో పూర్తిగా తగ్గుముఖం పడుతుంది.
చికిత్స...
ఇది దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఎంతమాత్రమూ ప్రమాదకరం కాదు. ఈ కండిషన్ వచ్చినప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం, జింక్ బేస్‌డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గకపోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా డెర్మటాలజిస్ట్‌ను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.