అందమైన ఘాట్ రోడ్లు, కొండకోనలు, చుట్టూ పరుచుకున్న ప్రకృతి, హిమ శిఖరాల
సౌందర్యం, పొడవైన వంతెనలు, పాతాళాల లోకాన్ని తలపించే సొరంగమార్గాలు... ఇలా
ఒకటేమిటి ఇక్కడ కనిపించే ప్రతి ప్రకృతి దృశ్యం పర్యాటకుని మదిని నిలువెల్లా
దోచేస్తుంది. స్థానికులు కొలుచుకునే దేవతం ‘శ్యామలాదేవి’ పేరుతో
ప్రసిద్ధమైన, భారత్‌లో అత్యంత విశిష్టమైన పర్యాటక ేకంద్రం సిమ్లా గురించే
మనం చెప్పుకుంటున్నది. 1819లో బ్రిటీష్ వారిచే కనుగొనబడిన సిమ్లా, ఆ
తరువాత 1864వ సంవత్సరంలో సమ్మర్ ‘క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా ప్రకటించ
బడింది. నిగనిగలాడే ఎరన్రి ఆపిల్ తోటలకు ప్రసిద్ధిగాంచిన సిమ్లాలో
విహరిద్దాం... రండి...
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన కొండల మధ్య కొలువైయున్న సిమ్లా
చేరుకోవటం పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ప్రాంతంలో
ఎటుచూసినా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. ముఖ్యంగా
సిమ్లా ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరించే ఆపిల్
పండ్లు చెట్లలో గుత్తులు గుత్తులుగా వేలాడుతూ దారి పొడవునా తోరణాలవలె
స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.
శ్యామలాదేవి పేరుతో...
శ్యామలాదేవి పేరుతో...
సిమ్లా పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా
చెప్పుకోవాల్సింది శ్యామలాదేవి ఆలయం. ఈ ఆలయాన్నే అక్కడి స్థానికులు కాలిబరి
ఆలయంగా పిలుస్తుంటారు. ఈ ఆలయంలో కొలువైయున్న దేవత శ్యామలాదేవి వల్లనే
సిమ్లాకు ఆపేరు వచ్చినట్లుగా చెబుతుంటారు.బ్రిటీష్ వారి కాలంలో సిమ్లాను
వేసవి విడిదిగా ఉపయోగించు కునేవారు. దేశ విభజన సమయంలో కాశ్మీర్‌కు
సంబంధించిన చర్చలు ఇక్కడి వైశ్రాయ్ భవనం లోనే జరగటం విశేషంగా చెప్పవచ్చు.
అందుకనే సిమ్లాను సందర్శించే పర్యాటకులు తప్పకుండా వైశ్రాయ్ భవనాన్ని కూడా
దర్శిస్తుంటారు. ప్రస్తుతం ఈ భవనంలో ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
అడ్వాన్స్ స్టడీస్’ను ఏర్పాటు చేశారు.
అడ్వెంచరస్ టూర్...
మంచును కుప్పగా రాశి పోసినట్లుగా ఉండే పర్వతాలు, దట్టంగా పరచుకున్నట్లుగా ఉండే ఆ మంచు పర్వతాల మీద సూర్యకిరణాలు పడి మెరిసిపోతూ వెండికొండలన్న విశేషణానికి అక్షరాలా అర్థాన్నిస్తున్నట్లుగా ఉండే ప్రకృతి సౌందర్యం సిమ్లాకు సొంతం. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లుగా ఉండే ఫైన్, ఓక్ చెట్లు అడుగడుగునా సిమ్లాలో ప్రత్యక్షమవుతాయి. స్నో స్కీయింగ్ చేయాలనుకునేవారికి ఇది ఓ స్వర్గధామమే.సిమ్లానుంచి కుఫ్రి వెళ్లేదారి అంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు, మరోవైపు లోతెంతో కూడా అంతుపట్టలేని అగాథాలుంటాయి. ఈ పర్వత శ్రేణులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటే, లోయలన్నీ రంగు రంగుల సీతాకోక చిలుకల్లా ఉంటాయి.
వింటర్ స్పోర్ట్‌సకు కేంద్రమైన సిమ్లాలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో స్పోర్ట్‌స వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.సిమ్లా పట్టణం ఓ కొండ వాలులో విస్తరించి ఉంటుంది. అర్ధచంద్రాకారపు పర్వత సానువుల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటుచూసినా ఫైన్, దేవదారు చెట్లు ఒకదాన్ని మించి మరొకటి ఆకాశాన్నంటాలన్న తాపత్రయంతో పెరుగుతున్నట్లుగా ఉంటాయి. అయితే శీతాకాలంలో మాత్రం ఈ చెట్లను మంచుదుప్పటి కప్పేసి, ముగ్గుబుట్ట తలపై కుమ్మరించుకున్న పాపాయిల్లాగా ఉంటాయి. ఇక్కడి ఇళ్లన్నీ దూరంనుంచి చూస్తే ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉంటాయి.సిమ్లా వెళ్లినవారు మొట్టమొదటగా దర్శించేది మాల్ రోడ్‌నే. మాల్ సెంటర్ ఇక్కడ ఓ ప్రత్యేక ఆకర్షణ.
షాపింగ్ చేసినా, చేయకపోయినా అంతా తిరిగి చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడు తుంటారు.గుర్రమెక్కి మాల్ అంతా చుట్టి, పనిలో పనిగా ఒక ఫొటో తీసుకుంటే ఆ మధురానుభూతే వేరు. సిమ్లాలోను, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలోనూ ఆపిల్ తోటలు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు ఏమీ అనరు. అయితే పండు కాకుండా పచ్చికాయను మాత్రం ముట్టుకుంటే అస్సలు ఒప్పుకోరు.
హాట్ వాటర్ స్ప్రింగ్ మాయ..!
ఈ వేడినీటి గుండంలోని నీరు తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. అయితే ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. ఈ నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ

స్నానం చేస్తే...
సిమ్లాలో ముఖ్యంగా దర్శించాల్సిన వాటిలో హిమాలయా పర్వతాలు అత్యద్భుతంగా
కనిపించే స్కాండల్ పాయింట్, చర్చి, లైబ్రరీ, లక్కడ్ బజార్.. తదితరాలు
ముఖ్యమైనవి. లక్కడ్ బజార్‌లో కొయ్యలతో చేసిన హస్తకళల వస్తువులు విరివిగా
దొరుకుతాయి. స్కాండల్ పాయింట్ నుంచి జనరల్ పోస్ట్ ఆఫీస్ వైపు కాస్త
దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుంది. ఇందులో ఉన్న దేవత శ్యామలా దేవి. ఈ
దేవత నుంచే సిమ్లాకు ఆ పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు.సిమ్లాలోనే
ఉన్న జాకూ ఆలయం ఉన్న శిఖరం కూడా ప్రత్యేకంగా చూసి తీరాల్సిందే. ఇక్కడి
నుంచి చూస్తే సిమ్లా అంతా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే హనుమాన్
ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాస్త ఓపికతో నడిచి వెళ్లాల్సి
ఉంటుంది.
నడవలేనివారి కోసం గుర్రాలు, ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.ఇక ఇక్కడి స్టేట్ మ్యూజి యంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయిం టింగ్స్ ఉన్నాయి. భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మ్యూజియంలో ఆసక్తి కలవారికి సమయం ఎలా గడిచిపోతోందో కూడా అంతుపట్టకుండా ఇట్టే గడిచిపోతుంది.అలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ కూడా చూడదగ్గ ప్రాంతమే. అక్కడినుంచి 15 నిమిషాలు నడిస్తే ప్రాస్పెక్ట్ హిల్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ కామనదేవి ఆలయాన్ని దర్శించవచ్చు. దాని నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సమ్మర్ హిల్ చూడవచ్చు. అక్కడ ఉండే జార్జియన్ హౌస్‌లోనే మహాత్మాగాంధీ విడిది చేశారట. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది.

సిమ్లా నుంచి బయలుదేరినప్పటినుంచి ప్రతి ఐదు లేక ఆరు కిలోమీటర్లకు ఒక
టూరిస్ట్ ప్లేస్ దర్శనమిస్తుంది. అలాంటి వాటిలో తత్తపాని, హాట్ వాటర్
స్ప్రింగ్ (వేడినీటి గుండం) మర్చి పోకుండా దర్శించాలి. ఈ వేడినీటి
గుండంలోని నీరు తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా
చల్లగా ఉంటాయి. అయితే ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. ఈ
నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట.
అందుకే ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతుంటారు.
చూడాల్సినవివే...
చూడాల్సినవివే...
సిమ్లాలో ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నప్పటికీ.. అల్లంత దూరాన
ఉండే హిమాలయా పర్వతాలను కళ్లముందు సాక్షాత్కరింపజేసేలా ఉండే స్కాండల్
పాయింట్, చర్చి లైబ్రరీ, లక్కడ్ బజార్ తదితర ప్రాంతాలను తప్పకుండా సంద
ర్శించాల్సిందే. ఇక్కడి లక్కడ్ బజార్‌లో దొరికే కొయ్యతో చేసిన కళాకృతులు
పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.వీటితోపాటు శిఖరం అంచుల్లో ఉండే జాకూ
ఆలయాన్ని కూడా తప్ప కుండా చూడాల్సిందే. ఈ ప్రాంతం నుంచి చూస్తే సిమ్లా
పూర్తి దృశ్యం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇంకా సిమ్లా చుట్టుప్రక్కల
ప్రాంతాలలో సైతం అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అలాంటివాటిలో ముఖ్యంగా
చూడాల్సిన ప్రదేశం వేడినీటి గుంటలు.
ఎముకలు కొరికే చలి ఓవైపు చంపేస్తుంటే, ఇక్కడి వేడినీటి గుంటల్లోని నీరు మాత్రం ఎప్పుడుచూసినా వేడిగానే ఉంటుంది. ఈ నీటి గుంటల్లో స్నానం చేసినట్లయితే చర్మ వ్యాధులన్నీ నయం అవుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకనే ఇక్కడికి వచ్చేవారు స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక సిమ్లా నుంచి కుఫ్రి వెళ్లే దారిలో నిలువెత్తు పర్వత శిఖరాలు అబ్బుర పరుస్తుంటే, మరోవైపు అంతులేని అగాధాల్లాంటి లోయలు గుండెల్లో గుబులు పుట్టించక మానవు .ఇంకా.. రిడ్జ్, మాల్, జాకో టెంపుల్, స్టేట్ మ్యూజియం, ప్రాస్పెక్ట్ హిల్, సమ్మర్ హిల్, చాడ్విక్ ఫాల్స్, సంకత్ మోచన్, తారా దేవీ, ఫాగు, నర్కంద, కోట్‌గర్హ్, రాంపూర్, సారాహన్,
ఖారపత్తార్, జుబ్బల్, హట్‌కోటి, మాసోబ్రా, క్రైగ్‌నానో, నల్‌దేహ్రా, తట్టపని, చిండిలాంటి చూడదగిన ఎన్నో ప్రదేశాలు సిమ్లాలో ఉన్నాయి.
ఇలా చేరుకోండి...

న్యూఢిల్లీ నుంచి చండీఘడ్, కల్కాల మీదుగా సిమ్లా చేరుకోవాల్సి ఉంటుంది.
కల్కా అనేది సిమ్లాకు ప్రవేశ ద్వారంలాంటిదని చెప్పవచ్చు. కల్కా నుంచి
సిమ్లా వెళ్లేందుకు రైలు సౌకర్యం కూడా కలదు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు
దారి పొడవునా ఎత్తయిన హిమాలయా పర్వతశ్రేణులు, వాటిపై పెరిగిన ఫైన్, ఓక్
చెట్ల సౌందర్యం కళ్లు తిప్పుకోనీయకుండా చేస్తుంది. అలా రైలు సొరంగ
మార్గాలు, బ్రిడ్జీల గుండా పయనిస్తుంటే ఓవైపు సంతోషం, మరోవైపు కాస్తంత
గుబులు కలుగకమానదు. మే-జూలై, సెప్టెంబర్-నవంబర్ మాసాలలో పర్యటనకు అనువుగా
ఉంటుంది.