నీలగిరి కొండల విశేషాలను తెలుసుకుందామా....


నీలగిరులు తమిళనాడులో ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని ఉదకమండలం అనీ, ఊటీ అనీ పిలుస్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఇది చక్కని వేసవి విడిదిగా ప్రసిద్ధికెక్కింది. బ్రిటిష్ అధికారులు మనదేశంలో చల్లని ప్రదేశాలను అన్వేషించే వారు. ఆ జాబితాలో దీనిని ‘క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్స్’ అనేవారు. ఇది సముద్రమట్టానికి ఏడున్నర వేల అడుగుల ఎత్తులో ఉంది. ఊటీ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరాన బొటానికల్ గార్డెన్ ఉంది. ఇక్కడ మనసు దోచే పుష్పజాతులు ఎన్నింటినో చూడవచ్చు. స్టేషన్‌కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో సరస్సు ఉంది. ఇది 1824లో అప్పటి కోయంబత్తూర్ కలెక్టర్ జాన్ సిలికాన్ ఆధ్వర్యంలో నిర్మితమైంది.

మైసూర్ రోడ్డులో ప్రభుత్వం నిర్వహిస్తున్న జంతు ప్రదర్శన శాలలో అనేకపురాతన గ్రంథాలు ఉన్నాయి. వీటితోపాటు ఊటీలో అరన్మోర్ ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్, బరోడా ప్యాలెస్, ది పెడుర్స్, నవనార్ ప్యాలెస్‌లు ఉన్నాయి. ఊటీ నుంచి కూనూర్ వెళ్లేదారిలో ‘టైగర్ హిల్’ ఉంది. విల్సన్ ఫిష్‌ఫామ్, నీలగిరి లైబ్రరీ, కల్‌హట్టి ఫాల్స్ ఇక్కడ చూడాల్సినవి. ఇక్కడ ఏటా ఫ్లవర్ షో జరుగుతుంది.

 
ఊటీ చేరడానికి కోయంబత్తూర్, తిరుచ్చి, మధురై, కన్యాకుమారి మొదలైన ప్రదేశాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. కోయంబత్తూర్ నుంచి ఊటీకి రైలు కూడా ఉంది. రైలులో వెళ్తే ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. చెన్నై నుంచి మెట్టుపాలయం వరకు రైలు ఉంది. అక్కడి నుంచి ఊటీకి నీలగిరి ఎక్స్‌ప్రెస్ ఉంది. అక్కడికి ఊటీ 52 కి.మీల దూరం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top