మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్... చికిత్స

మన శరీరంలోని రక్తాన్ని వడపోసి, మాలిన్యాలను బయటకు పంపించే పనిని మూత్రపిండాలు నిర్వహిస్తాయి. శరీరంలోని అధికభాగం రక్తం గుండె నుంచి వెలువడిన తర్వాత మూత్రపిండాల ద్వారా వెళ్తుంది. కాబట్టి రక్తప్రవాహం వల్ల కలిగే ఒత్తిడికి మూత్రపిండాలు లోనవుతాయి. రక్తపోటు అత్యధికంగా ఉన్నవారిలో మూత్రపిండాలు ప్రభావితమై దెబ్బతినడానికి కారణం ఇదే. 

రక్తంలోని జీవరసాయన వ్యర్థాలను, శరీరానికి అవసరం లేని ఇతర పదార్థాలను కిడ్నీలు రక్తం నుంచి వేరుచేస్తాయి. మూత్రం ద్వారా ఇవి బయటకు విసర్జితమవుతాయి. మూత్రం... కిడ్నీలకు ఇరుపక్కలా ఉండే యురేటర్స్ అనే నాళాల ద్వారా మూత్రాశయం లేదా బ్లాడర్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నుంచి మూత్రనాళం (యురెథ్రా) ద్వారా మూత్రం బయటకు వెళ్తుంది. మూత్రవిసర్జన చేసే సమయంలో మూత్రాశయపు కండరాలు మూత్రాన్ని ఎక్కువ ఒత్తిడితో బయటకు పంపించడానికి సహకరిస్తాయి. పురుషుల్లో మూత్రనాళం అన్నది పురుషాంగం ద్వారా ప్రయాణిస్తే, మహిళలకు ఇది యోని లోపలే తెరచుకుంటుంది. మామూలు సందర్భాల్లో మూత్రం బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులేవీ లేకుండా (అంటే స్టెరైల్‌గా) ఉంటుంది. అయితే మూత్రంలో ఉండే గ్లూకోజ్ వల్లగాని, ఇతర ఖనిజాల వల్లగాని బ్యాక్టీరియా చేరితే మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. అందుకే చక్కెరవ్యాధి ఉన్నవారికి మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్‌కు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. 

మూత్ర సంబంధ వ్యాధులకు కారణం... 
సాధారణంగా మూత్రవ్యవస్థలో వ్యాధులు రావడానికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, మరికొన్ని ఇతర పరాన్నజీవులు కారణమవుతుంటాయి. ఇందులోనూ సాధారణంగా బ్యాక్టీరియా వల్ల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. వీటిని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌గా చెబుతారు. పురుషుల్లో కంటే మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆహారంలో మసాలాలు, మద్యం, కాఫీ వంటి వాటి వల్ల కూడా మూత్రవిసర్జన సమయంలో మంట వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్నిరకాల సబ్బులు, పౌడర్లు మూత్రమార్గాన్ని ఇరిటేట్ చేసి మూత్రంలో మంటను కలిగించవచ్చు. నైలాన్‌తో తయారుచేసిన లో-దుస్తుల వల్ల కూడా కొందరిలో మూత్రవిసర్జన సమయంలో మంట రావచ్చు. 

హోమియో చికిత్స: మూత్రసంబంధమైన సమస్యల విషయంలో అన్ని పరీక్షలు కూలంకషంగా నిర్వహించి మంట అన్నది మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్ కారణంగానా లేక కిడ్నీలో రాళ్లు, వాపు, ఇతరత్రా కిడ్నీ సమస్యల కారణంగానా అన్నది నిర్ధారణ చేశాక చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియోలో ఎపిస్, క్యాంథరిస్, నేట్రంమూర్, కెన్నబిస్, సబల్ సెర్యులేటా, సాలిడాగో, ఆర్స్ ఆల్బ్ వంటి మందులు బాగా పనిచేస్తాయి. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top