బరువును తగ్గించే అతి సులభమైన.. సాధారణ పద్దతులు...!


సాధారణంగా కొందరు ఏం తిన్నా ఎంత తిన్నా ఏ మాత్రం లావెక్కకుండా సన్నగా ఉంటారు. మరి కొందరు కొద్దిగా తిన్నా విపరీతంగా లావెక్కుతారు. అలాంటి వారినే ఊబకాయులు అంటారు. నిజానికి మనం సాధారణంగా తీసుకొనే ఆహారం మీదే బరువు పెరగడం, తగ్గడం అన్నది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని చాలా మంది మరిచిపోతుంటారు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పద్దతులను పాటిస్తే తప్పకుండా బరువు తగ్గవచ్చు.
ఆందోళన, ఒత్తిడికి దూరంగా: బరువు తగ్గే క్రమంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. పై రెండిటి కారణంగా బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో రుజువైంది.
ఆకలిని గుర్తించండి: ఆకలి వేయడానికి సుమారు అరగంట ముందే మెదడు ఆహారం కావాలన్న సూచనలను అందిస్తుంది. ఆ సూచ నలను ఏమాత్రం గమనించకుండా ఆకలి అనిపించిన గంటో, గంటన్నర తరువాతో ఆహారం తీసుకోవడం వలన ఫలితం ఉండదు. అలాగే కడుపు నిండినట్లు అనిపించగానే తినడం ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేయడం మరిచిపోకూడదు: ఎంత తిన్నా, ఏది తిన్నా, భోజనానికి సరికాదు అంటారు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. బరువు తగ్గాలను కునేవారు భోజనం అస్సలు మానేయకూడదు. అయితే మీరు తీసుకునే భోజనాన్ని తగ్గించుకొని ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ పెద్ద మొత్తంలో తీసుకోవాలి. మధ్యాహ్నాం, రాత్రి భోజనంలో వరికి బదులు రాగులు, గోధు మలు, సజ్జలూ ఉపయోగించుకోవాలి. రాత్రి పడుకోవడానికి నాలుగు గంటలు ముందే భోజనం ముగించాలి.
చక్కెరకు దూరంగా: బరువు తగ్గాలనుకునే వారు తీపి పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిందే. వీరు చక్కెరకు బదులు బెల్లం లేదా తేనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు.వీటితో పాటు తీపి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.
వ్యాయామం: వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
ఆటలు కూడా మంచి వ్యాయామా న్నిస్తాయి. పెద్ద వయస్సులో ఆటలు ఏమిటి? అనుకోనవసరం లేదు. పిల్లలను తీసుకొని ప్లే గ్రౌండ్‌కి వెళ్లినప్పుడు వారి ఆటల్లో పాల్గొనవచ్చు. పిల్లలతో కలిసి ఆడుకుంటే చాలు మరే ఇతర వ్యాయామాలు అక్కర్లేదు. ఇంతకు మించి పెద్దగా కష్టపడాల్సిన విషయాలేమీ ఉండవు.
నిద్రలేమి: కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఆరోగ్య రహస్యాలు అంటారు. నిద్ర లేమి కూడా ఊబకాయానికి ఓ కారణం. ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top