జుట్టు రాలడాన్ని అరికట్టి.. ఆరోగ్యంగా ఉంచే 7 వండర్ ఫుడ్స్...!


పాలు: తెల్లగా ఉండే పాలు నల్లని జుట్టుని ఎలాంటి మ్యాజిక్‌ చేయగలవు అని సందేహం రావుచ్చు మీకు. నిజానికి పాల వల్ల శరీరానికి కాల్షియంతో పాటు జుట్టుకు కూడా బోలెడు లాభాలు. జుట్టు చిక్కులు పడకుండా దానికి చేతనెైనంతగా అది కృషి చేయడంతో పాటు సరికొత్త కేశ కళను లిగించడంలో మీకు ఎంతో తోడ్పడుతుంది. డ్రైహేయిర్‌ ను మంచి కండీషన్‌లో తీసుకురావాలనుకుంటే మాత్రం పాలను నమ్ముకోవడం బెస్ట్‌.
బాదం: రోజుకో ఆపిల్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే అవసరం లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం బాదాంకు కూడా వర్తిస్తుంది. రోజుకు గుప్పెడు బాదాంలను తింటే కేవలం జుట్టుకే లాభం కాదు మీ గుండెకు కూడా మంచిది. టాపిక్‌ హెయిర్‌ గురించి కాబట్టి బాదాం వల్ల మీ హెయిర్‌ సరికొత్త మెరుపును సంతరించుకోవడంతో పాటు, జుట్టు రాలిపోవడం వంటి సవుస్యలు ఎదురుకావు.
వెజిటేబుల్స్ : వెజిటేబుల్స్‌ తక్కువేం కాదు ఆకుపచ్చ రంగులో ఊరించే బ్రకోలీ, పాలకూరల వంటి ఆకు కూరల వల్ల డబుల్‌ బెనిఫిట్‌. ఒకటి వీటిని తరచూ మీ ఆహారంలో భాగం చేయడం వల్ల ఎ, సి , కె వంటి విటమిన్లతో పాటు ఐరన్‌, కాల్షియం సము పాళ్లలో అందుతుంది. రెండవది మీ జుట్టుకు మంచి కండీషన ర్‌గా కూడా పనిచేస్తాయి.
క్యారెట్ : రేటు తక్కువ .. రేంజ్‌ ఎక్కువ. అం దమైన కళ్లకు, దృష్టికి తోడ్పడటంతో పాటు శరీరాన్ని డిటాక్సికేట్‌ చేస్తుంది. చిరుతిళ్లు తినాలనిపించినప్పుడు ఒకటి రెండు క్యారెట్స్‌ను తినండి. కొన్ని రోజుల్లోనే అందమైన మార్పును మీరూ గమనిస్తారు.
ఫ్లాక్స్‌ సీడ్స్‌: ఫ్లాక్స్‌ సీడ్స్‌లో జుట్టు పెరుగుదలకు అవసరమైన ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి.ఆరోగ్యవంతమైన కురులకోసం కావాల్సిన ప్రొటీన్‌, ప్రాకృతిక ఫైబర్‌లను ఇది అందిస్తుంది.ఈ విత్తనాల నూనెను సాధారణ నూనెలాగే ఆహారపదార్ధాలలో వినియోగించవచ్చు.
చికెన్‌: చికెన్‌ తింటే న్యూట్రీషన్స్‌తో పాటు విటిమిన్స్‌ ఫ్రీ. జుట్టు ఎదుగుదలకు దోహదం చేసే ప్రోటీన్స్‌కూడా సమృద్ధం. ఇది చికెన్‌ థెరపీ.
చేపలు: సముద్రంలో ఉండే చేపలకు మనిషి జుట్టుకు కొన్ని లింక్స్‌ ఉన్నాయి. వలలో చిక్కుకోకుండా తప్పించుకోవడంలో చేప ఎక్స్‌పర్ట్‌. రెగ్యురల్‌గా చేపలను ఆహారంలో భాగంచేసుకుంటే మీ జుట్టు కూడా చిక్కులలో చిక్కుకోవు.. చేపలలో ఉండే విటమిన్‌ డి ఆరోగ్య వంతమైన కురులకోసం ఉపయోగకర మైనవే కాకుండా, ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్‌తో సమృద్ధం. ఇది నాన్‌వెజ్‌ హెయిర్‌ థెరపీ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top