చాలామంది మోకాళ్లనొప్పులతో బాధపడటం చూస్తుంటాం - కారణాలు - చికిత్స

చాలామంది మోకాళ్లనొప్పులతో బాధపడటం చూస్తుంటాం. శరీర బరువును మోయడంలో ప్రధానపాత్ర పోషించేది మోకాలు. దెబ్బలు ఎక్కువగా తగిలే అవకాశం ఉన్న అవయవం కూడా మోకాలే. నిలబడటానికి, కూర్చోవడానికి, పక్కకు తిరగడానికి, నడవడానికి, పరుగెత్తడానికి ఉపయోగపడే మోకాళ్లకు నొప్పులు వస్తే, శరీరం మూలపడినట్లే. అందుకే మోకాళ్ల నొప్పులను విస్మరించకూడదు. 

కారణాలు: 
మోకాలి జాయింట్ కింద ఉండే ఎముకల్లో పటుత్వం తగ్గడం లేదా 
అరిగిపోవడం.
రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ మ్యారో క్యాన్సర్ వంటి జబ్బులు.
ప్రమాదాల్లో మోకాళ్లకు గాయాలు కావడం.
స్థూలకాయం కారణంగా మోకాళ్లపై అదనపు బరువు పడటం.
ఆధునిక జీవనశైలి వల్ల మోకాళ్లకు తగిన వ్యాయామం లేకపోవడం. 
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను వినియోగించడం. 

సాధారణంగా ఎముక చివరన ఉండే కణాలు 40 రోజులకు ఒకసారి చనిపోయి ఆ ప్రాంతంలో కొత్త కణాలు పుడతాయి. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనే జబ్బు ఉన్నవారిలో జబ్బు ఉన్నచోట కణాలు పుట్టవు. కానీ జబ్బు లేనిచోట మాత్రం కణాలు పెరుగుతాయి. ఫలితంగా కణాలు అసమానంగా పెరగడం, పెరిగిన చోట కణాలు ఒరిపిడికి గురికావడం, ఫలితంగా ఒరిపిడి కలిగిన చోట నొప్పి కలగడం జరుగుతాయి.
కీళ్లజబ్బు నిర్ధారణ: కీళ్లజబ్బు ఉన్నదీ లేనిదీ నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్‌రే, ఎమ్మారై, రక్త, మూత్ర పరీక్షలు, సీటీ స్కాన్, సైనోవియల్ కల్చర్ వంటి పరీక్షల సహాయంతో సమస్యను లేదా వ్యాధిని గుర్తించి, అందుకు అనుగుణంగా చికిత్స చేస్తారు. 

చికిత్స: వైద్య పరీక్షల ద్వారా మోకాలు నొప్పికి అసలు కారణం తెలుసుకుని, మందులు వాడాల్సి ఉంటుంది. ఆధునిక హోమియో చికిత్స ద్వారా మంచి మందులను వాడుతూ, ఆపరేషన్స్ లేకుండానే చికిత్స అందించవచ్చు. ఈ మందులు మోకాళ్లలో వ్యాధి లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఏర్పడే టాక్సిన్స్‌ను బయటకు పంపి నొప్పిని తగ్గిస్తాయి. గాయం వల్ల దెబ్బతిన్న భాగాలకు రక్తసరఫరాను పునరుద్ధరించి గాయం త్వరగా మానడానికి ఉపకరిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ తొలిదశలోనే జరిగితే, దెబ్బతిన్న కార్టిలేజ్ తిరిగి రూపొందేలా చేయగల అవకాశం ఉంది. మోకాళ్ల నొప్పులకు హోమియోలో రస్టాక్స్, లెడమ్‌పాల్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో తగిన పొటెన్సీలో వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top