పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంగా గడుపుతున్నారా, ఆందోళనలతో భారంగా నెట్టుకొస్తున్నారా?

పిల్లలు తమ బాల్యాన్ని ఆనందంగా గడుపుతున్నారా, ఆందోళనలతో భారంగా నెట్టుకొస్తున్నారా? ఈ విషయం తల్లిదండ్రులందరూ నిశ్చయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు పిల్లల మనస్తత్వ నిపుణులు. స్కూల్‌లోనూ ఇంట్లోనూ పొంతనలేని నిబంధనలు, చుట్టూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఏర్పడుతున్న దూరం... ఇలాంటివెన్నో పిల్లలను ఆందోళనకు లోనుచేస్తున్నాయి. ఇవి నిజమో కాదో తెలుసుకోవాలంటే పిల్లలకు చేరువగా ఉండి గమనించాలి.

ఆందోళన వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఈ ప్రభావం శారీరక ఆరోగ్యంమీదా పడుతోంది. ఆందోళన స్థాయి దాటిందంటే డిప్రెషన్‌కు దారి తీయవచ్చు. అది పిల్లల కెరియర్‌కి, అనుబంధాలకు అడ్డుగోడగా నిలవవచ్చు. చెడు అలవాట్లకు దగ్గర చేయవచ్చు. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే...

పిల్లలలో ఉన్న ఆందోళనలు ఏమిటో, ఎందుకో తెలుసుకోగలిగితే సమస్య సగం పరిష్కారం అయినట్టే. అందుకే పిల్లలు తమ సమస్యలను పంచుకోదగిన ఆహ్లాదకర వాతావరణం ఇంట్లో కల్పించాలి. ‘మేమున్నాం’ అనే మానసిక భద్రతను ఇంటి నుంచే ఇవ్వాలి. పనుల హడావిడిలో కాకుండా లీజర్‌గా ఉన్నప్పుడో, కథా రూపంలోనో తెలియజేస్తే పిల్లలు ఆసక్తిగా వింటారు. తమ సమస్యలను విశ్లేషించుకునే వివేకం అబ్బుతుంది. 

ఆందోళనలు సహజమేనని, చిన్న వయసులో వాటిని తామెలా అధిగమించామో చెప్పాలి. పిల్లల ఆందోళనను తగ్గించడానికి, ఆత్మ విశ్వాసం పెంచడానికి టీచర్లు, స్నేహితుల సాయం తీసుకోవాలి. 
పిల్లలు తల్లిదండ్రులనే రోల్‌మోడల్‌గా ఎంచుకుంటారు. తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసం ఎంతగా ఉందో బేరీజు వేయగల సమర్థులు పిల్లలే. అందుకే మీలో ఉన్న ఆందోళనలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆ ఆందోళనలు పిల్లల భవిష్యత్తుకు అగాధం కాకుండా చూడండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top