వర్షాకాలంలో ముందుజాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

వర్షాకాలంలో డైట్ టిప్స్ వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు బాగా కడిగిన తర్వాతే తినాలి. అధికంగా వేపుడు పదార్థాలు, అధికంగా ఉప్పు ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవద్దు. వేడిచేసి చల్లార్చి ఫ్యూరిఫై చేసిన నీటిని తాగటంతోపాటు వంటకు వాడుకోవాలి. సీజనల్‌గా సోకే ఇన్ఫెక్షన్‌లకు దూరంగా ఉండాలంటే బయట జ్యూస్‌లు, మిల్క్‌షేక్‌లు తీసుకోవద్దు. ఆరోగ్యసంరక్షణకు చర్యలు వర్షంలో తడవటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశముంటుంది. జలుబు, తగ్గు వస్తే వెంటనే మందులు వాడండి. వర్షాకాలంలో హార్ష్ సబ్బులు వాడకండి. మీ చర్మం శుభ్రంగా ఉండాలంటే ఫేస్‌వాష్‌లు వినియోగించవచ్చు. పాదాల రక్షణ వర్షాకాలంలో రోడ్లపై నడవటం వల్ల కాళ్లకు బురదతోపాటు మట్టి అంటుకుంటుంది. దీని నుంచి పాదాల రక్షణకు రెయిన్ ఫ్రూఫ్ షూలు వినియోగించవచ్చు. షూ వేసుకోవడం వల్ల వర్షంలోనూ మీ పాదాలు డ్రైగా ఉంటాయి. పని ప్రదేశంలో వేసుకునేందుకు వీలుగా శాండిల్స్‌ను వేసుకోవచ్చు. కేశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి వర్షాకాలంలో కేశాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే మంచిది.తలంటి స్నానం చేశాక టవల్‌తో బాగా తుడుచుకొని కేశాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. చుండ్రు నివారించేలా కేశాలపై వర్షాకాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చర్మ రక్షణ వర్షాకాలంలో చర్మ సంరక్షణకు సన్‌స్క్రిన్ లోషన్ ప్రతిరోజు వినియోగించాలి. చర్మ రక్షణకు పాలు,ఆరెంజ్ ఇతర పండ్లతో కూడిన పేస్ట్ వాడితే మంచిది. మొటిమల నివారణకు శ్రద్ధ చూపాలి. రాత్రి నిద్రపోయే ముందు మీ ముఖంపై ఐస్‌ప్యాక్‌లు పెట్టుకోవడం వల్ల మీ ముఖం వర్చస్సు రెట్టింపవుతుంది. వర్షంలో వాటర్‌ఫ్రూఫ్, ఆయిల ఫ్రీ మేకప్ వేసుకోవటం మేలు. దోమకాటును నివారించుకోండి మలేరియా రావడానికి ప్రధాన కారణమైన దోమల కాటు నుంచి నివారించుకోండి. రాత్రి వేళల్లో ఇంట్లోకి దోమలు రాకుండా మీ ఇంటి ద్వారాలు, కిటికీలు మూసి ఉంచుకోవటం మేలు. మీ ఒంటిని పూర్తిగా కప్పేలా ఫుల్‌షర్టు, నైట్ ఫ్యాంట్‌లు ధరించండి. దోమల నివారణకు వీలుగా ఇన్‌సెక్ట్ రిపెల్లెంట్స్ వాడితే మేలు. దోమతెర వినియోగించినా దోమకాటు బారి నుంచి రక్షించుకోవచ్చు. వర్షాకాలంలో ముందుజాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top