పిల్లలు స్వతంత్రంగా మెలగాలంటే!?

మీ పిల్లలు చేసే పనుల పట్ల ఆసక్తిని చూపాలి. ఏ పనైనా చకచకా చేస్తున్న వారి ని అంతకంగారెందుకు? అని మందలించడం, నెమ్మదిగా వున్నవారిని మరీ ఇంత నత్తనడకా? లాంటి కామెంట్లతో మార్చాలని ప్రయత్నించడం సరికాదు. పిల్లలు ఏదైనా కొత్త పని చేస్తుంటే దాని ఫలితం గురించి చెప్పి భయపెట్టటం తగదు.పిల్లలకీ మీ ఆలోచనలు, సూచనలు తెలియజెప్పాలి. వివిధ సమస్యల్ని పిల్లలతో చర్చించడమూ మంచిదే. మీరు కోరుకున్నట్టు పిల్లలు ఏవేవో సాధించాలని వారి మీద ఒత్తిడి చేయకూడదు. అన్నిటి గురించి బోధిస్తూ పిల్లల్లోని సరదాని అణచి వేయకూడదు. పిల్లలు తమాషా పనులు ఏమైనా చేస్తుం టే చులకనగా మాట్లాడకూడదు. దాని వల్ల వారిలో పెరగాల్సిన సెన్సాఫ్‌ హ్యూమర్‌ దెబ్బ తింటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top