వంటింట్లో మనం రోజూ వాడే పదార్థాలతో కలిగే ప్రయోజనాలు...

పసుపు :* నీళ్లలో కాస్తంత పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు మటు మాయమైపోతుంది.మిరియాలు :
  • స్వచ్ఛమైన తేనెలో కాస్తంత అల్లం రసంతో పాటు నాలుగైదు మిరియాలు తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇంకా ఇది ఆకలిని కూడా పెంచుతుంది.
  • కొత్తిమీర :
  • మనం ఆహారంలో వేసుకునే కొత్తిమీర జీర్ణశక్తిని వౄఎద్ధి చేస్తుంది.
  • కాస్తంత కొత్తిమీర రసాన్ని కొద్దిగా అల్లం రసంతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
  • కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర రసం, అల్లం రసం ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగాలి. దాంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
  • ఏలకులు :
  • నోటి దుర్వాసనను ఏలకులు సమర్థంగా అరికడతాయి.
  • దాంతో పాటు వికా రం, తలనొప్పికి కూడా ఏలకులు మంచి మం దుగా పనిచేస్తాయి.
  • కళ్లు మంటలు, దురదలు తగ్గడానికి కూడా, ఏలకులు బాగా పనిచేస్తాయి.
  • శనగలు :
  • కఫం తగ్గించడానికి శనగలు బాగా పనిచేస్తాయి.
  • ఒక టేబుల్‌స్పూన్‌ శనగపిండిని ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రాతవ్రేళ తీసుకుంటే ఆ మిశ్రమం జీర్ణ సంబంధమైన అనేక సమస్యలను నివారిస్తుంది.
  • వెల్లుల్లి :
  • వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
  • వెల్లుల్లిని వాడినప్పుడు అందులోని అలిసిన్‌ అనే పదార్థం (ఇదే వెల్లుల్లికి ఘాటైన వాసన ఇస్తుంది) అధిక రక్తపోటు, గుండెజబ్బుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
  • వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇంకా రక్తనాళాల్లోని కొవ్వును తగ్గిస్తుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top