మానసిక ఒత్తిడిని దూరం చేసే...


    వంటకాలలో ఉపయోగించే సువాసన ద్రవ్యాల రాణిగా పేరుపొందినది యాలుక. నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందించడంలో యాలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. వం టకాలలో సువాసన ద్రవ్యంగా ఉపయోగించబడే యాలుకలో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. దానిలోని గింజలు కూడా ఔష దల గుణాలను కలిగి ఉన్నాయి. 40 సంవత్సరాలు వాటిమీద పరిశోధనలు జరిగాయి. సువా సన కలిగిన యాలుక గింజలు కడుపు నొప్పిని నయం చేస్తాయి. జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా, డస్ట్‌ ఎలర్జీ, కిడ్నీలో రాళ్ళు, ఇంకా బలహీనతను పోగొట్టడంలో యాలుకలు ఉపయో గించబడుకున్నాయి. నోటి దుర్వాసనను పోగొట్టడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. మానసిక ఒత్తిడికి గురైన వారు యాలుకల టీ తాగితే ప్రశాంతతను పొందుతారు.
    టీ పొడి తక్కువగానూ, యాలుక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను ఆఘ్రాణించడం వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనో త్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట. నోటిలో నీరు ఊరడం, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే తలనొప్పి,వాంతులు, ఊపిరితిత్తుల్లో కఫం మొదలైన సమస్యలకి కేవలం యాలుక్కాయలను నోట్లో వోసుకుని నమలడంతోనే నివారణ లభిస్తుందట. కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగించడం మంచిదికదా! ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కళ్ళు తిరగడం జరిగితే యాలుక్కాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

    నాలుగైదు యాలుక్కాయలను చితగ్గొట్టి అరగ్లాసు నీటిలో వేసి, కషాయంలాగా కాచి, అందులో కొంచెం పటికబెల్లం పొడి కలుపుకుని తాగితే తలతిరుగుడు వెంటనే తగ్గిపోతుంది. ఎక్కిళ్ళను వెంటనే ఆపగలిగే శక్తి యాలుకలకు ఉంది. రెండు యాలుకలను చితగ్గొట్టి, పుదీనా ఆకులను వేసి, అరగ్లాసు నీటిలో బాగా కాచి వడకట్టాలి. తర్వాత గోరువెచ్చగా అయ్యేవరకూ చల్లార్చి తాగితే వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top