సాధారణంగా మనం సోంప్ను భోజనం తర్వాత తినే పదార్థంగానే చూస్తుంటాం. కాని ఇందులోనూ ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి. దీనికి శతపుష్ప అనే మరో పేరుంది. ఇది నమిలితే ముఖ (నోటి) దుర్గంధం పోతుంది. అన్నం అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. విరేచనం సాఫీగా అవుతుంది. దప్పికను, వాంతులను తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.