నెగెటివ్ క్యాలరీల ఆహారం ఉందా?

నిజానికి మనం తీసుకునే ఎలాంటి ఆహారమైనా ఎంతో కొంత శక్తిని ఇచ్చే తీరుతుంది. వాస్తవానికి నెగెటివ్ క్యాలరీల ఆహారమంటూ లేనేలేదు. అయితే ఇటీవల కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అదనంగా ఎలాంటి శక్తి సమకూరదని, అలాంటివి డయాబెటిస్ రోగులకు సైతం ఇవ్వవచ్చునంటూ మార్కెట్‌లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వాటినే ‘ఫ్రీ ఫుడ్స్’ అంటూ అభివర్ణిస్తున్నారు. ఆ ‘ఫ్రీ ఫుడ్స్’నే కొందరు నెగెటివ్ క్యాలరీ ఫుడ్‌గా చెబుతుంటారు. అయితే నీటిలో కరిగాక ఆ ఆహారం తనలోని క్యాలరీలను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. అంతేగాని అసలు క్యాలరీలే లేకుండా ఏ ఆహారమూ ఉండదు.

ఇక... మరికొందరు వాము లేదా దోసకాయ లేదా చాలా పచ్చిగా ఉండే జామకాయ తిన్న తర్వాత శరీరంలోకి ఎంతమాత్రమూ శక్తి విడుదల కాదని అనుకుంటుంటారు. వాటిని నెగెటివ్ క్యాలరీల ఆహారంగా చెబుతుంటారు. సాధారణంగా దోసకాయ లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్న తర్వాత అందులోని పీచు పదార్థాల వల్ల కడుపు ఎక్కువగా నిండిపోయి తిన్నదానికి అనుగుణంగా శక్తి సమకూరనట్లుగా అనిపిస్తుంది. అందుకే దాన్ని నెగెటివ్ క్యాలరీల ఆహారంగా కొందరు పరిగణిస్తుంటారు.

ఇక కొందరు పచ్చి జామకాయను కొరికి తినడాన్ని ఇష్టపడ్డా, దానితో కడుపు నింపటం కంటే ఆ కాసేపు నోటిలో ఉండే రుచి కోసమే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దోసకాయలో జరిగేదే జామకాయ విషయంలోనూ జరుగుతుంది. అందుకే కొందరు వాటిని నెగెటివ్ క్యాలరీల ఆహారంగా చెబుతారు. నిజానికి నెగెటివ్ క్యాలరీలు అనే మాటకు ఎలాంటి ప్రాధాన్యంగాని, ఆ మాటలో వాస్తవికతగాని లేదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top