దీర్ఘకాలం పాటు యౌవనంగా కనిపించడానికి ఈ ఆహారం ...

చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు యౌవనంగా కనిపించడానికి ఈ ఆహారం దోహదపడుతుంది. ఆ ఆహార వివరాలు..

ఆహారం: తాజా చేపలు, అవిశలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. 
ప్రయోజనం: ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. కాస్త గరుగ్గా ఉండే చర్మాన్ని నునుపుగా చేస్తాయి. 


ఆహారం: ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు గోధుమల బ్రెడ్ (వీటిలో పీచు ఎక్కువ). 
ప్రయోజనం: శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. 


ఆహారం: వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్, అవొకాడో.
ప్రయోజనం: హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను వైటమిన్-బి6 నివారిస్తుంది. హార్మోన్‌ల సమతౌల్యత సక్రమంగా ఉండేలా సహాయపడుతుంది. 


తాజా పండ్లు: అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో... అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 
ప్రయోజనం: చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ-రాడికల్స్‌ను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. అందుకే చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండాలంటే తాజా పండ్లు తినాలి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top