గర్భం దాల్చాక అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఎప్పుడెప్పుడు, ఎందుకు..?

పిండంలో లోపాలు తెలుసుకోడానికి చేసే అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భం దాల్చిన 11-14 వారాల తర్వాత పరీక్ష చేయించడం అవసరం. ఆ తర్వాత మళ్లీ 18-20 వారాల్లో చేయించాలి. 

గర్భం దాల్చాక మొదట 11-14 వారాల్లో చేసే స్కానింగ్‌ను ‘న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ (ఎన్‌టీ) స్కాన్ అంటారు. ఈ పరీక్షలో క్రోమోజోమల్ లోపాలు, పిండం గుండెలో లోపాలు, జన్యుపరమైన వ్యాధులు తెలుస్తాయి. ఎన్‌టీ పరీక్ష చేయడం ద్వారా జన్యుపరమైన వ్యాధులేవీ లేవని నిర్ధారణ చేయడం కోసం మరిన్ని అడ్వాన్స్‌డ్ క్రోమోజోమల్ పరీక్షలు అవసరమా అన్న విషయం తెలుస్తుంది. పిండంలోని గుండెలో లోపాలేవీ లేవని తెలుసుకోవడం కోసం పిండానికి చేసే గుండె పరీక్ష (ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ) అవసరమా లేదా అన్న సంగతి తేటతెల్లమవుతుంది. 

గర్భం దాల్చాక 12వ వారంలో చేసే స్కానింగ్‌తో అనెన్‌సెఫాలి వంటి మెదడుకు సంబంధించిన కొన్ని మేజర్ సమస్యలు, కాళ్లూ చేతుల్లో లోపాలేవైనా ఉన్నాయా అన్న విషయాలను తెలుసుకోవచ్చు. 

ఇక 18 - 20 వారాల్లో చేసే పరీక్ష ద్వారా చాలా ఉపయోగకరమైన అంశాలను తెలుసుకోవచ్చు. మన దేశంలో చాలా సందర్భాల్లో గర్భస్రావాలు 5వ నెలలో (20వ వారంలో) చేయిస్తుంటారు. శిశువులో సరిదిద్దలేని లోపాలుంటే తదనుగుణంగా నిర్ణయం తీసుకోడానికి ఈ దశలో చేసే స్కానింగ్ ఉపయోగపడుతుంది. ఈ దశలో చేసే పరీక్షను ‘మిడ్ ట్రై మిస్టర్ అనామలీ స్కాన్’ అంటారు. ఇందులో పిండం తల నుంచి కాలి వరకు అన్ని అవయవాలను చూడటం సాధ్యమవుతుంది. ఈ దశలో చేసే స్కాన్ వల్లనే పిండం అన్ని రకాలా నార్మల్ ఉందన్న భరోసా తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. మిడ్ ట్రై మిస్టర్ అనామలీ స్కాన్ ద్వారా క్రోమోజోమ్ లోపాలు ఏవైనా ఉంటే వాటిని, ఒక కాలు పెద్దగా లేక మరో కాలు కురచగా ఉండటం వంటివి ఏవైనా ఉంటే ఆ సమస్యలను, పిండంలో ఎదుగుదల లోపాల వంటివాటిని ఈ దశలో తెలుసుకోవచ్చు. పిండం తల చిన్నగా ఉండటం (మైక్రో సెఫాలీ), అస్థిసంబంధమైన లోపాలు (నాన్ లీథల్ స్కెలెటల్ డిస్‌ప్లేసియా), గుండె, రక్తప్రసరణ వ్యవస్థలో ఎక్కడైనా అడ్డంకులు ఉన్నాయా అన్న విషయం బహిర్గతమయ్యే అవకాశాలు ఈ దశ స్కానింగ్‌లో ఉంటాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top