లవకుశులు చదువుకున్న చోటు...

బ్రహ్మావర్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్‌కి 15 కి.మీల దూరంలో ఉంది. ఈ ప్రదేశం చారిత్రకంగానూ, పౌరాణికం గానూ విశిష్టమైనది. బ్రహ్మదేవుడు సృష్టి ఇక్కడి నుంచే ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ధ్రువచరిత్ర జరిగింది ఇక్కడే. ఇది ధ్రువుని తండ్రి ఉత్తానపాదుని రాజ్యం. ఇక్కడికి సమీపంలో వాల్మీకి ఆశ్రమం ఉంది. దీనిని శ్రీరామునికి- లవకుశులకు యుద్ధం జరిగిన ప్రదేశంగా చెబుతారు. 

సీతాదేవి, లవకుశులు, వాల్మీకి ఆలయాలు ఉన్నాయి. లవకుశులు విద్యాభ్యాసం చేసిన స్థలం కూడా ఇదే. ఈ క్షేత్రం ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాల నడుమ ఉంది. ఇక్కడికి కాన్పూరు నుంచి రోడ్డు మార్గాన చేరవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top