కలవరపరిచే తలనొప్పి... మైగ్రేన్ గురించి తెలుసుకుందాము.

మైగ్రేన్ అనేది రక్తనాళాలకు సంబంధించిన సమస్య. మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తం ప్రవహించడంతో వాటి పరిమాణం ఒక్కసారిగా వ్యాకోచించి, నరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. రక్తనాళాలు వ్యాకోచించినకొద్దీ నొప్పి అధికం అవుతుంది. ఈ సమస్య వల్ల సింపాథెటిక్ నరాల వ్యవస్థ ఉత్తేజితమై సమస్యలు కలుగుతాయి. ఈ సమస్య తీవ్రస్థాయికి చేరినప్పుడు నరాలవ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల మెదడులో సమస్య ఉన్న భాగం నుంచి వచ్చే నరాల పనితీరు ప్రభావితమై శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఉదాహరణకు వెర్టిబ్రోబేసిలార్ మైగ్రేన్‌లో మెదడు మొదలులోని భాగం ప్రభావితం కావడంవల్ల కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం, హెమీప్లీజిక్, రెటినల్, ఆక్యులార్ మైగ్రేన్‌లలో శరీరం పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. 

కారణాలు: 
మానసిక ఒత్తిడి 

నిద్రలేమి 

ఉపవాసం 

హార్మోన్ల సమస్యలు 

అధిక వెలుతురు 

వాసనలు 

మత్తుపదార్థాలు, పొగాకు వాడకం 

కాఫీ వంటి పానీయాలు 

మహిళలలో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఎక్కువ కావటం. వీటివల్ల పై లక్షణాలు కనిపించవచ్చు.

లక్షణాలు: 
తలనొప్పి అధికంగా, ఒకవైపు లేదా రెండువైపులా ఉండవచ్చు 

వికారం, వాంతు లు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వెలుతురు చూసి తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం 

నిద్రలేమి, చికాకు, నీరసం, వంటివి కనపడతాయి. 

జాగ్రత్తలు : 

ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో నిద్రపోవాలి 

మద్యపానం, పొగతాగడం వంటివి మానుకోవాలి 

కొవ్వుపదార్థాలు, మాంసం, పప్పుదినుసులు ఉన్న ఆహారాన్ని తగ్గించి, సాధ్యమైనంత వరకు అల్పాహారాన్ని తీసుకోవాలి 

తగినంత నీరు తాగాలి 

రోజూ వ్యాయామం చేయాలి 

మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. 

హోమియో చికిత్స: ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు సాంగ్వినేరియా, బ్రయోనియా, నేట్రమ్‌మూర్, పల్సటిల్లా, నక్స్‌వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటి మందులు ఉన్నాయి. వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకుని పై మందులను వాడాల్సి ఉంటుంది. 


ఈ  విషయాలు అవగాహన కోసం,మీరు డాక్టర్ సలహా తోనే మందులు వాడాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top