కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు,లక్షణాలు మొదలగు వాటి గురించి తెలుసుకుందాము

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాలవ్యాధికి కారణమవుతాయి. దాంతో వడపోత సామర్థ్యం తగ్గి ఆరోగ్యం దిగజారుతుంది. అందువల్ల ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా హోమియో చికిత్స అందించినట్లయితే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు : శారీరక శ్రమ తక్కువగా ఉండటం రోజూ తగినన్ని నీళ్లు తాగకపోవడం గౌట్ రకం కీళ్ల వ్యాధి కుటుంబచరిత్రలో కిడ్నీ సంబంధిత వ్యాధులు / కిడ్నీలో స్టోన్స్ సమస్య ఉండటం స్థూలకాయం శరీరంలో రాళ్లు ఏర్పడే లక్షణం (లిథియాక్ టెండెన్సీ) చలికాలం మద్యపానం వంటివి ముఖ్య కారణాలు. ఇక సీకేడీ (దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి), పుట్టుక నుంచి ఒకటే కిడ్నీ ఉండటం లేదా చిన్న కిడ్నీలు ఉండటం, పీసీకేడీ (పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్) లాంటి వ్యాధులతో బాధపడేవారు తక్కువగా నీళ్లు తాగాల్సి ఉంటుంది. అందువల్ల వీరిలోనూ కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 

లక్షణాలు : కిడ్నీలు నడుముభాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది. పిండేస్తున్నట్లు, భరించలేని నొప్పి ఉంటుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి తీవ్రత మరింత పెరుగుతుంది. తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపురంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పితో పాటు వికారంగా ఉండటం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం లేదా వెళ్లవలసి రావడం, అకస్మాత్తుగా లేదా తరచు వాంతులు కావడం, జ్వరం రావడం వంటివి జరుగుతాయి.

నివారణ : రోజూ శారీరక వ్యాయాయం, నడక, నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టొమాటో, సోయాబీన్, చాక్లెట్లను పరిమితంగా తీసుకోవడం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు. చిన్నపిల్లలు, ఎదిగే వయసులోని పిల్లలు తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారిలో ఆకలి తగ్గి, జీర్ణక్రియ మందగించడం వల్ల ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల తొలిదశలోనే గుర్తించి, వ్యాధి పూర్తిగా తగ్గేలా చికిత్స తీసుకోవడం ఉత్తమం. 

చికిత్స : సెలైంట్ స్టోన్స్, క్రానిక్ స్టోన్స్ అనేవి దీర్ఘకాలం పాటు ఉంటాయి. వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్ల మళ్లీ తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది శాశ్వత పరిష్కారం కాదు. హోమియో వైద్యవిధానం ద్వారా వీటిని మళ్లీ మళ్లీ రాకుండా తగ్గించవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top