సుగర్‌ ఎక్కువైతే అనర్థమే

రక్తంలో సుగర్‌ ఎక్కువయితే అది శరీరంలోని కణాల నుంచి నీటిని తీసుకుంటుంటుంది. దాంతో డిహైడ్రేషన్‌ కలుగుతుంది. అందుకే రక్తంలో సుగర్‌ ఎక్కువగా ఉన్నవాళ్లు డయాబెటిక్స్‌ దాహంతో బాధపడుతుం టారు. డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఆకలితో ఎందుకు అలమటిస్తుంటారంటే ఎంత తిన్నా జీర్ణమైన ఆహారం కణాలకు చేరదు కాబట్టి. 

వాటితోబాటు మూత్రానికి ఎక్కువసార్లు పోతున్నా, కారణం లేకుండా బరువు తగ్గిపోతున్నా, అలసట, నీరసం ఎక్కువగా ఉన్నా చూపు అలికినట్లున్నా, గాయాలై త్వరగా మానకుండా ఉన్నా, కాళ్లుచేతుల్లో తిమ్మిర్లుగా ఉంటున్నా, వయసు 30 దాటుతున్నా రక్తపరీక్షల ద్వారా డయాబెటిస్‌ ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. వ్యాధి ఉంటే వైద్యుల సలహా మేరకు జాగ్రత్తపడాలి. 


డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే అనర్థాలు అధికం. డయాబెటిస్‌ జబ్బు కాదు గానీ అన్ని జబ్బులకు మూలం, అదుపులో ఉంచు కోకపోతే. ఆర్టెరీస్‌ రక్తనాళాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా సన్నటి రక్తనాళాలకు ముప్పు ఉంటుంది. ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువ. అలా రక్తనాళాలలో కొవ్వు పేరుకు పోవడంవల్ల హార్ట్‌ ఎటాక్‌ లేక స్ట్రోక్‌లాంటివి రావచ్చు. పెద్ద రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. కాళ్లలో రక్తనాళాలు దెబ్బతిని, గాంగ్రిన్‌ లాంటివి కలిగే ప్రమాదాలు న్నాయి. అధిక రక్తపోటు కలగవచ్చు.

అదీ గుండెకి ప్రమాదమే కదా? ఆహార నియంత్రణ చాలా అవసరం. కొవ్వు పదార్థాల్ని తగ్గించివేయాలి. కడుపునిండా తినకూడదు. ఖాళీ కడుపుతో ఉండకూడదు. నాలుగు గంటలకోసారి కొద్దికొద్దిగా తీసుకోవాలి. డయాబెటిస్‌తో నరాలు దెబ్బతింటాయి. నరాల మీద ఉండే పొర దెబ్బతినడంతో న్యూరోపతి వస్తుంది. రక్తనాళాలు దెబ్బతింటే, వాస్క్యులోపతి అంటారు. పొడవాటి రక్తనాళాలు దెబ్బతిన్నట్లే, పొడవాటి నరాలు దెబ్బతింటాయి. అందుకే పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారానికొకసారైనా గోరు వెచ్చని నీటిలో పాదాల్ని ఉంచి, తర్వాత శుభ్రంగా తుడవాలి. డయాబెటిస్‌వల్ల ఒక్కోసారి మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతినవచ్చు.


డయాబెటిక్‌ వల్ల రెటినోపతి రావచ్చు. కళ్లలోని రెటీనా దెబ్బతినడంవల్ల ఇది వస్తుంది. ఇన్‌ఫెక్షన్స్‌ త్వరగా రావచ్చు. క్షణాల్లో వ్యాపించవచ్చు. అంగస్తంభన, నరాలు, రక్తనాళాలు దెబ్బతినడంవల్ల తగ్గి దాంపత్య జీవితం దెబ్బతింటుంది. నరాలు దెబ్బడంవల్ల నొప్పి లేకుండా గుండె నొప్పి లాంటివి వస్తాయి. అందుకే దీనిని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డయాబెటీస్‌ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top