మదుమేహం, అధిక రక్తపోటుకు పరిష్కారం డీటాక్సిఫికేఫన్ థెరపీలు

 శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి టాక్సిన్స్‌ను బయటకు పంపే మార్గం లేదా? అంటే డీటాక్సిఫికేషన్ ప్రక్రియ చక్కగా ఉపయోగపడుతుంది. డీటాక్సిఫికేషన్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడమే కాకుండా వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అధికరక్తపోటు, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, పీసీఓడీ వంటి స్త్రీ సంబంధ సమస్యలు, ఆర్థరైటిస్, ఆస్తమా, గుండె సంబంధ వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు.

డీటాక్సిఫికేషన్ ఎందుకు అవసరం?
అనారోగ్యకరమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలేకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు, ఒత్తిడి మూలంగా మొత్తం జీర్ణవ్యవస్థపైన ప్రభావం పడుతోంది. జీవక్రియలు గతితప్పుతున్నాయి. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతున్నాయి. అంతేకాకుండా తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణంకానప్పుడు పోషకాహారలోపం ఏర్పడుతుంది. ఫలితంగా కణాలకు శక్తి అందకుండా పోతుంది. రోగనిరోధకవ్యవస్థ దెబ్బతింటుంది. టాక్సిన్స్ లేదా వ్యర్థపదార్థాలు సరిగ్గా బయటకు వెళ్లకపోవడం వల్ల నెమ్మదిగా పొట్టలో పేరుకుపోతాయి. తరువాత కణాల్లోకి విస్తరించి అనేక వ్యాధులకు కారణమవుతాయి.

టాక్సిన్స్ వల్ల ఏం జరుగుతుంది?

తేలికగా జీర్ణంకాని ఆహారం తీసుకోవడం, ఆహారం మోతాదుకు మించి తినడం, జంక్ ఫుడ్, అవుట్‌సైడ్ ఫుడ్ తీసుకోవడం, మాంసాహారం ఎక్కువగా తినడం, రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం వంటివి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కిందకు వస్తాయి. కూర్చుని చే సే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం, పగటి వేళ నిద్రపోవడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం వంటివి అన్‌హెల్తీ లైఫ్‌స్టయిల్ కిందకు వస్తాయి. తెలిసో, తెలియకో చిన్నతనం నుంచి కొన్ని రకాల వ్యాధులను అణిచివేస్తుంటాం. ఉదాహరణకి జ్వరం వచ్చినపుడు చాలా కారణాల వల్ల టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇవి జీర్ణాశయం లోకి, కణాలలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా కణాలలో జనించిన అగ్ని జ్వరం రూపంలో బయటపడుతుంది. అల్లోపతి మందులు నేరుగా జ్వరం తగ్గించేందుకు పనిచేస్తాయి. కానీ టాక్సిన్స్‌ను బయటకు పంపడంపై దృష్టి పెట్టవు. మూలకారణాన్ని తొలగించ వు. పైకి జ్వరం తగ్గినా వ్యాధి మూలకారణం అణిచివేయబడి ఉంటుంది. అలా అణిచివేయబడిన టాక్సిన్స్ ఆర్థరైటిస్, చర్మ వ్యాధులు, శ్వాససంబంధ సమస్యలు, క్యాన్సర్‌కు దారితీస్తాయి.

జరిగే నష్టం ఏమిటి?
ప్రాథమిక దశలో నీరసంగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, జీర్ణశక్తి తగ్గిపోవడం, జీర్ణసంబంధ సమస్యలు ఉత్పన్నం కావడం జరుగుతుంది. చర్మం నిగారింపు తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. తరచుగా ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుంటారు. తరువాత దశల్లో అనేక రకాల వ్యాధులు వచ్చిపడతాయి. ఆస్తమా, ఆర్థరైటిస్, ఒబేసిటి, అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, డయాబెటిస్, చర్మ సంబంధ సమస్యలు, పీసీఓడి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, జుట్టు రాలిపోవడం జరుగుతుంది.

చికిత్స ఎలా ఉంటుంది?

ముందుగా బాడీ కానిస్టిట్యూషన్, వయస్సు, జీర్ణశక్తి, రోగనిరోధక వ్యవస్థ పనితీరు ఎలా ఉంది తదితర అంశాలను పరిశీలించడం జరుగుతుంది. ఆహారపు అలవాట్లు, జీవనవిధానాన్ని గమనించి శరీరంలో నుంచి టాక్సిన్స్ బయటకు పంపించేందుకు అవసరమైన చికిత్సను ఇవ్వడం జరుగుతుంది. వ్యాధి మూలకారణాన్ని తొలగించడంపై ఆయుర్వేద చికిత్స ఎక్కువగా దృష్టి సారిస్తుంది. డీటాక్సిఫికేషన్ ప్రక్రియ కోసం అభ్యంగనం, ఊద్వర్థనం వంటి 60 రకాల ఆయిల్ థెరపీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన మెడికల్ ఆయిల్స్‌తో చికిత్స చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ బయటకు వెళతాయి. ఫలితంగా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రతీ వ్యక్తి మెడికల్ హిస్టరీ, శరీర ధర్మం, లైఫ్‌స్టయిల్, ఆహారపుల అలవాట్లు, మందులు ఇవ్వడం ద్వారా శరీర వ్యవస్థను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై వ్యక్తిగతంగా దృష్టిపెట్టి చికిత్స అందించడం జరుగుతుంది. 10 నుంచి 30 రోజుల పాటు ఈ చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులన్నీ శాశ్వతంగా దూరమవుతాయి.

ప్రయోజనాలు
ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతీ ఒక్కరికీ డీటాక్సిఫికేషన్ అవసరం. జీవనవిధానం సరిగ్గా లేకపోవడం, వ్యాధుల బారినపడే అవకాశం ఉన్న వారు ఈ చికిత్సను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జీవక్రియలు(మెటబాలిజం) మెరుగుపడతాయి. రక్తపోటు, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. అధిక బరువు తగ్గవచ్చు. గుండె సంబంధ సమస్యలకు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. మొత్తంగా చూస్తే జీవక్రియలన్నీ మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top