మెగా డాటర్ పరిస్థితి ఏమిటి?

టాలీవుడ్  లో ఈ  మధ్య కాలంలో తరచుగా నిహారిక పేరు వినపడటం చూసాం. ఎందుకంటే ఆమె మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి హీరోయిన్. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుండి హీరోలు మాత్రమే వచ్చారు. అందుకే అందరి దృష్టి నిహారిక మీద పడింది. నిహారిక ఇంటిలో అందరిని ఒప్పించి మరీ హీరోయిన్ గా 'ఒక మనస్సు' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 



అయితే ఆ సినిమా మొదటి రోజే నస సినిమా,బోరుగా ఉందని టాక్ రావటంతో మెగా అమ్మాయి డీలా పడిపోయింది. ఈ సినిమాపై నిహారిక మరియు మెగా అభిమానులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. దాంతో సినిమా ప్రమోషన్ కి కూడా దూరంగా ఉండిపోయింది నిహారిక. 


Niharika future was completed

అయితే ఇప్పుడు నిహారిక ఏమి చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సినిమాల్లో రాణించాలంటే ఎంతో కొంత గ్లామర్ తప్పనిసరి. మరి ఈ మెగా వారసురాలికి ఇది సాధ్యం కాదు. మరి నిహారిక సినిమాల్లో కొనసాగాలా... వద్దా అనే విషయంలో అయోమయంలో ఉంది. 


నిజానికి నిహారిక హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వటం చిరంజీవికి ఇష్టం లేదనే టాక్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మొదట నిహారిక సినిమాల్లో నటిస్తానంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు సినిమాల్లో నటిస్తుందా లేదా తెర వెనక ఉంటుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top