మహాభారత యుద్ధం తరువాత అసలేం జరిగింది?

మహాభారతం గురించి తెలియని వారు ఉంటారా? బహుశా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు గాని... శ్రీ కృష్ణ పరమాత్ముడి లీలలు, పాండవులు, కౌరవులు.... వారి మధ్య కురుక్షేత్ర యుద్ధం.... ఇలా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. పాత సినిమాలు చూసే వారికి ఇంకా బాగా తెలిసుంటుంది. 

CLICKHERE : నిమ్మరసంతో ఉన్న లాభాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు

అందుకే శ్రీ కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే.... విశ్వా విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామరావు లా ఉంటాడని టక్కున చెప్తారు. మహాభారతం గురించి.... అందులోని నీతుల గురించి... మన పెద్దలు తరచు చెబుతూనే ఉంటారు.

18 రోజులు పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలోని 80శాతం పురుషుల జనాభా మరణించారు. ఇప్పటికి మనదేశంలో కురుక్షేత్ర యుద్ధాన్నే అతి పెద్ద యుద్ధంగా భావిస్తారు. ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు.. కౌరవులు ఓడారు. కాని యుద్ధం అనంతరం ఎవరెవరు బ్రతికున్నారు.... వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయం చాల తక్కువ మందికే తెలుసు.

మరి యుద్ధంలో గెలిచినా పాండవులు, శ్రీ కృష్ణ పరమాత్ముడు ఎలా మరణించారో ఇప్పుడు తెలుసుకుందాం!!

* కురుక్షేత్ర యుద్ధం అనంతరం హస్తినాపుర రాజ్యానికి పాలకులుగా పాండవులు వ్యవహరించారు. కౌరవుల తల్లి అయిన గాంధారి... నా కొడుకులు చనిపోయినట్టే, నువ్వు నీతో ఉన్నవారు అందరు దారుణంగా చనిపోతారు... అంటూ శ్రీ కృష్ణుడిని శపించింది.

CLICKHERE : రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి.. బరువు తగ్గండి!

* పాండవులు హస్తినాపుర రాజ్యాని 36 ఏళ్ళు పరిపాలించారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన తరువాత గాంధారి శాపం ఫలించింది. తను శపించినట్టే.. ద్వారకాలో వింత అలజడులు చోటుచేసుకున్నాయి. అక్కడి ప్రజలందరిని ప్రభాస క్షేత్రానికి తరలిస్తాడు శ్రీ కృష్ణుడు. కాని అక్కడ కూడా ప్రజలు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెడతారు.

CLICKHERE : ఐన్ స్టిన్ జీవితం గురించి తెలిస్తే...ఆశ్చర్యపోతారు

* ఈ సందర్భంలోనే ఓ వేటగాడు వదిలిన బాణం శ్రీ కృష్ణుడి కాలికి గుచ్చుకుంటుంది. దీంతో శ్రీ కృష్ణుడు తన శరీరాన్ని వదిలి విష్ణు దేవునిలా దర్శనమిస్తాడు. శ్రీ కృష్ణుడు వెళ్ళిపోయిన తరువాత.... పాండవులు తమ జీవిత గమ్యాన్ని చేరుకున్నారు అని వేదవ్యాసుడు చెబుతాడు.

* ద్వాపర యుగం పూర్తయ్యి.. కలి యుగం రాబోయే సమయంలో, పాండవులు తమ భార్య ద్రౌపది తో కలిసి స్వర్గ లోకానికి చేరడానికి హిమాలయాలను ఎక్కడం ప్రారంభిస్తారు. మధ్యదారిలో యమధర్మరాజు ఓ శునకంలా మారువేషంలో పాండవుల ప్రయాణంలో కలిసిపోతాడు.

CLICKHERE : ఇది చదివితే బంగారు ఉంగరాలు తీసేస్తారు

* దారిలో ద్రౌపదితో మొదలుకొని భీముడి వరకు ఒకోక్కరిగా నేల రాలిపోవడం మొదలవుతుంది. వారు చేసిన పనులే ఇలా జరగడానికి కారణం. యధిష్టిరుడు మరియు తనతో వచ్చిన శునకం స్వర్గ ద్వారం వరకు చేరుకుంటారు. స్వర్గ ద్వారం వద్ద తన అసలు రూపం దాలుస్తాడు యమ ధర్మరాజు.

* యమ ధర్మరాజు యధిష్టిరుడుని స్వర్గం లోనికి ప్రవేశించే ముందు... నరక లోకంలో అతని సోదరులు మరియు భార్య, వారు చేసిన పాపాలకి ఎలాంటి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారో చూపిస్తాడు. ఆ తరువాత స్వర్గ లోక అధిపతి ఇంద్రుడు యధిష్టిరుడుని స్వర్గం లోని తీసుకొని వెళ్తాడు.

CLICKHERE : భామల రేటు చూస్తే... షాక్ అవ్వాల్సిందే

శ్రీ కృష్ణుడు, పాండవులు తమ సాధారణ జీవితానికి ఈ విధంగా స్వస్తి పలికారు. వీరు భూమిని విడిచి వెళ్ళిన తరువాత కలియుగం మొదలయ్యింది. ఇక కలియుగం ఎలా ఉందో మనకి తెలిసిందే!!

CLICKHERE : మనం కొనే మందులు అసలైనవా...నకిలీవా....ఎలా తెలుసుకోవాలి?

CLICKHERE : రామాయణం తర్వాత లవ కుశులు ఏమయ్యారు?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top