నిమ్మరసంతో ఉన్న లాభాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు

ప్రతి రోజు ఒక గ్లాస్ నిమ్మ రసం మనల్ని డాక్టర్ కు దూరంగా ఉంచుతుంది. బరువును తగ్గించడం లో నిమ్మకాయ పోషించే పాత్ర అందరికి తెలిసిందే. కాని ఇంత చిన్న నిమ్మకాయలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండడంతో పాటు ఇంకెన్నో లాభాలున్నాయని మీకు తెలుసా? క్రమం తప్పకుండా నిమ్మకాయ వాడడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలనుండి తప్పించుకోవచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు తెలియ చేస్తున్నారు.


మొటిమలు
మొటిమలతో ఇబ్బంది పడుతున్నవారికి నిమ్మకాయ అద్భుతమయిన ప్రత్యామ్నాయం.నిమ్మలో వుండే
యాంటి బాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ని కలిగించే బాక్టీరియాని నియంత్రించడం లోను మరియు నిమ్మరసం బాడీ ని డిటాక్స్ చేయడం లోను ఎంతో ఉపకరిస్తున్నది. తరచూ నిమ్మరసాన్ని ఫేస్ వాష్ గా వాడటం వలన ముఖం పై చర్మంలో వున్నా మృత కణాలను తొలగించడమే కాకుండా ముఖం పై అనవసరపు జిడ్డును కూడా తొలగిస్తుంది.


CLICKHERE : ఒత్తయిన జుట్టుకోసం... ఏం చేయాలంటే?

అపటైజర్ గా నిమ్మరసం
నిమ్మరసం టేస్ట్ మీకు నచ్చినట్లయితే మీరు నిత్యం తాగే సాఫ్ట్ డ్రింక్స్ స్థానం లో దీనిని త్రాగడం ద్వారా మీ శరీరంలో చేరే అధిక చక్కెరలను తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. రెండు మూడు చుక్కల నిమ్మరసాన్ని మీరు త్రాగే నీటికి కలిపి త్రాగడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా త్రాగే నీరు మంచి రుచి కూడా వుంటుంది.

CLICKHERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి

కిడ్నీలో రాళ్ళు
ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళ వల్ల ఇబ్బంది పడేవారు చాలామంది వున్నారు.నిమ్మరసం లో వుండే సహజ సిట్రేట్లు కిడ్నీలో రాళ్ళను విచ్చిన్నం చేయడమే కాకుండా అవి రాకుండా నియంత్రిస్తుంది కూడా పలువురు వైద్య నిపుణులు కిడ్నీ స్టోన్స్ నివారణలో సిట్రేట్ ను సూచిస్తున్నారు.

CLICKHERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా

వ్యాధి నిరోదికత పెంచడానికి నిమ్మరసం
మీరు తరచూ జలుబు లేదా దుమ్ము వలన ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నారా? మీరు తరచూ అనారోగ్యం భారిన పడుతున్నారా? అయితే వెంటనే నిమ్మరసాని ట్రై చేయాల్సిందే. నిమ్మరసం లో వుండే సి విటమిన్ శరీరం లో వుండే వ్యాధి నిరోదికతను అభివృద్ధి చేస్తుంది.అంతే కాక నిమ్మరసం స్ట్రెస్ నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.

CLICKHERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్


జలుబు మరియు ముక్కు దిబ్బడ 
నిమ్మరసం తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ, జలుబు మరియు ఫ్లూ నుండి ఉపశమనాన్ని ఇవ్వడమేకాక మీ శరీరాన్ని డి హైడ్రేషన్ నుండి కూడా కాపాడుతుంది. నిమ్మరసానికి ఒకటి లేదా రెండు చుక్కలు తేనే కలపడం ద్వారా యాంటి బాక్టీరియల్ లక్షణాలు పెరిగి శరీరం తేలికగా వుంటుంది.

CLICKHERE : చిట్లిన జుట్టుకు....గుడ్ బై చెప్పేద్దామా?

యాంటి ఇన్ ఫ్లామేటరీ గా
ఆస్థమా మరియు ఇతర శ్వాస సంబంద వ్యాధులకు నిమ్మరసం అధ్బుతం గా పనిచేస్తుంది. నిమ్మరసం లో వుండే విటమిన్ - సి యాంటి ఇన్ ఫ్లామేటరీ గా పనిచేస్తుంది.

CLICKHERE : కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

విషాహారం నుండి ఉపశమనానికి
నిమ్మరసం శరీరంలో వున్న బాక్టీరియా మరియు జెర్మ్స్ ను నియంత్రిస్తుంది. నిమ్మలో వున్న సిట్రిక్ ఆసిడ్ మిమ్మల్ని ఫుడ్ పోయజనింగ్ నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. డైరెక్ట్ గా నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా ఫుడ్ పోయజనింగ్ నుండి మరింత త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు

CLICKHERE : తెలుగు హీరోల పారితోషికాలు ఎంతో తెలుసా?


అజీర్ణం భాదలనుండి
మీ కనుక ఏమైయిన ఉదర సంభందిత భాదలతో ఇబ్బందిపడుతూ వుంటే నిమ్మరసం మీకు ఎంతో వుపయోగికారి.హీట్ బర్న్స్ మరియు అసిడిటీ నుండి మిమ్మల్ని కాపాడుకోవడానికి నిమ్మరసం దివ్య అవుషధమనే చెప్పాలి.

CLICKHERE : ముఖంపై నల్లమచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి? 
Share on Google Plus