నిహారిక నిల‌బ‌డ‌లేదా..?మెగా ఫ్యామిలీ వ‌ద్దంటోందా..?


మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌ని టైంలో సినీ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది నిహారిక‌..నాగ‌బాబు త‌న‌య‌గా, మెగా ఫ్యామిలీ ఆడ‌ప‌డుచుగా అభిమానులు ఆద‌రిస్తార‌ని ఊహించింది. కానీ తొలి ప్ర‌య‌త్నంలోనే బెడిసికొట్టింది. హిట్ కాదు క‌దా..క‌నీసం న‌టిగానూ గుర్తింపు పొంద‌లేక‌పోయింది. అందుకే మ‌రో ప్ర‌య‌త్నం చేయ‌డానికి సిద్ధంగా లేన‌ట్టు తెలుస్తోంది.

CLICKHERE : KFC అధినేత గురించి మీకు తెలుసా?

నిహారిక‌ మొదటి సినిమాకే రాంగ్‌ స్టెప్‌ వేసింది. ‘ఒక మనసు’లాంటి కథని సెల‌క్ట్ చేసుకోవ‌డం మైన‌స్ గా మారింది. అసలే మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో సగటు హీరోయిన్‌ పాత్రలతో ఆమెని అప్రోచ్‌ అవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మొదటి సినిమా ఫ్లాప్‌తో మళ్లీ సినిమా అంటే భయపడుతోన్న నిహారికని ఆ దిశగా మెగా ఫ్యామిలీ కూడా ప్రోత్సహించడం లేదు. అలాగ‌ని నిహారిక ప‌ట్టుబ‌డితే కాద‌న‌లేరు. కానీ ఇప్పుడు ఈ కొణిదెల కుమారే ధైర్యం చేయ‌ట్లేద‌ని తెలుస్తోంది.

CLICKHERE : మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు

సినిమాల వైపు ఇప్ప‌ట్లో చూసేలా క‌నిపించ‌డం లేదు నిహారిక‌. అందుకే వెబ్ సిరీస్ ల‌తో కాల‌క్షేపం చేస్తోంది. సినిమాలో న‌టించ‌డానికి ముందే జ‌బ‌ర్ధ‌స్త్ షోలో త‌న తండ్రి నాగ‌బాబును ఇమిటేట్ చేసి అంద‌రితో ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ సినిమాల్లో మెప్పించ‌లేక‌పోయింది. అందుకే ఇప్పుడు యూట్యూబ్ వైపు మ‌ళ్లింది. ఇప్ప‌టి ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా డిజిట‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుంటే …సినిమాల సంగ‌తి త‌ర్వాత చూడొచ్చ‌ని నిహారిక ప్లాన్ వేసిన‌ట్టుంది. మ‌రి యూ ట్యూబ్ లో ఐనా ఆక‌ట్టుకుంటుందా..? మెగా ఫ్యామిలీయే చొర‌వ తీసుకుని నిహారిక‌ను మ‌రోసారి సినిమాకు ఎంక‌రేజ్ చేస్తారా..? అనేది అనుమాన‌మే..

CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వలసిందే

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top