హీరోయిన్ గా పనికిరాదేమో అన్న భావనలు పటాపంచలు చేస్తూ దక్షిణాది సుందరి దీపికా పదుకోన్ బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు చేరిపోయింది. ఇప్పుడామెతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. హాలీవుడ్ లోనూ అమ్మడు మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇదిలా ఉంటే బీటౌన్ లో ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ అందుకోని ఘనతను మన మస్తానీ సొంతం చేసుకుంది.
CLICKHERE : అల్లరి నరేశ్ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు
హిందీ చిత్రసీమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు గడించింది. రెమ్యునరేషన్ విషయంలో దీపిక దరిదాపుల్లో ఏ హీరోయిన్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పద్మావతి’కి ఈ సొగసరి దాదాపు రూ.12 కోట్లు అందుకుంటోందట. ఈ మొత్తం కొందరు హీరోల పారితోషకం కంటే కూడా చాలా అధికం.
CLICKHERE : పవన్ చిన్ననాటి స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు
CLICKHERE : పవన్ చిన్ననాటి స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు
హిందీ చిత్రసీమకు సంబంధించి పారితోషకం విషయంలో దీపిక సాధించిన ఘనత అందాల రాణులు ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రాలకు సైతం లేదు. ఇక ఆసక్తికర సంగతేంటంటే ‘పద్మావతి’ చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్న రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ ల కంటే కూడా దీపికనే ఎక్కువ తీసుకుంటోంది. బాలీవుడ్ లో హీరోలకి మించి ఒక కథానాయిక అత్యధిక పారితోషకం తీసుకోవడం విశేషమే.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ దీపిక, కత్రినాల పారితోషకాలపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తనకంటే, సల్మాన్ కంటే దీపిక, కత్రినాలు ఎక్కువ పారితోషకం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని వారు ఓ సినిమా కోసం హీరోల కంటే ఐదు రెట్లు అధికంగా కష్టపడతారని చెప్పారు. ఆ లెక్కన చూస్తే దీపిక ప్రస్తుతం అందుకుంటున్న పారితోషకం ఆమె శ్రమకు తగ్గ ఫలితమే.

