పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రభుత్వం!!


బంగారం విక్రయాలపై కేంద్రం సామాన్యులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీ ఇంట్లో ఎమర్జెన్సీ కష్టం వచ్చింది.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అప్పు ఇచ్చేవారు కూడా దొరకలేదు.. అయితేనేం ఒంటిపై బంగారాన్ని కుటుంబ అవసరాల కోసం అత్యవసరంగా విక్రయించాలనుకుంటున్నారా? అయితే ఇక మీకు సీతమ్మోరు కష్టాలు తప్పవు. 

CLICKHERE : రావుగోపాల్ రావు రెండో కుమారుడు ఎవరో తెలుసా? మనకు తెలిసిన నటుడే...ఎవరు?

భారతదేశంలో మధ్యతరగతి ఇంట్లో ఆకస్మికంగా బంగారం అమ్మడం, తాకట్టు పెట్టడం వంటి ఘటనలు సర్వసాధారణం. అలంకారంగా బంగారాన్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో.. అత్యవసరానికి కూడా అదేస్థాయిలో ఆదుకుంటుందనే ధీమా గోల్డ్ పై ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత.. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు సామాన్యుడికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగారం అమ్మకంపై కేంద్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి..

CLICKHERE : శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?

ఏప్రిల్ 1వ తేదీ తర్వాత బంగారం విక్రయిస్తే మీకు కేవలం పదివేల రూపాయల నగదే ఇస్తారట. మిగతా మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో వేస్తారట. అత్యవసరం దృష్ట్యా వైద్యం కోసం లేదా ఇతర కుటుంబ ఖర్చుల కోసం డబ్బు కావాలని బంగారం విక్రయిస్తే బ్యాంకు ఇచ్చే దాకా వేచి ఉండాల్సిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో సవరణలు తీసుకురానుంది. దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

CLICKHERE : జియో ఆఫర్ పొడిగింపు!

ప్రభుత్వం బంగారం అమ్మకాలు, కొనుగోళ్లను పారదర్శకం చేసేందుకే ఇలా చేశామని చెబుతుంటే.. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం కాలరాసినట్లేనని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కొత్త నిబంధన వల్ల బంగారం వ్యాపారం దెబ్బ తినే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top