విజయకుమార్ తమిళనాడుకు చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. తమిళ సినిమాలే కాక తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు.
విజయ కుమార్ తమిళనాడులోని తంజావూరు జిల్లా, పట్టుకోట్టై తాలూకా, నట్టుచాలై అనే ఊళ్ళో రంగసామి, చిన్నమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు పంచాక్షరం. సినిమాల కోసం విజయ కుమార్ గా మార్చుకున్నాడు. ఇతని మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు రెండవ భార్య సినీనటి మంజుల. ఇతనికి మొత్తం ఆరుగురు పిల్లలు; మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు; రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు. ఏకైక కొడుకు అరుణ్ విజయ్ నటుడిగా స్థిరపడి; ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత మరియు శ్రీదేవి కొన్ని సినిమాలలో నటించారు.

