కల్వకుంట్ల కవిత భారతదేశ రాజకీయ ఉద్యమకారిణి. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు.ఈ సంస్థ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహిస్తుంది. ఈమె తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
కవిత కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు మరియు తెలంగాణ రాష్త్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు శోభలకు జన్మించింది.ఆమె స్టాన్లీ బాలికల పాఠశాలలొ విద్యనభ్యసించింది. ఆ తర్వాత VNRVJIET నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 2001 లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
కల్వకుంట్ల కవిత దేవన్‌పల్లి అనిల్ ను వివాహమాడారు. ఆయన ఒక మెకానికల్ ఇంజనీరు. వారికి ఇద్దరు కుమారులు. వారు ఆదిత్య మరియు ఆర్య.

