దేశ టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదుపేసిన రిలయన్స్ జియో దెబ్బకు అన్ని టెలికాం రంగ సంస్థలు వినియోగదారులను కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. జియో మాత్రం మార్కెట్లో తన ఆఫర్ల తుఫాను కొనసాగిస్తూనే ఉంది. అయితే, తాజాగా జియో ప్రకటించిన “ధన్ ధనా ధన్” ఆఫర్‌తో.. కస్టమర్లను కాపాడుకునేందుకు టెలికాం సంస్థలు నిత్యనూతన ఆఫర్లు ప్రకటిస్తూ.. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా… భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులకు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటింనుందని… టెలికాం బ్లాగర్ సంజయ్ బఫ్నా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ కొత్త ప్రిపెయిడ్ ప్లాన్ వివరాలు… 4జీ వినియోగదారులకు రూ. 399తో రీచార్జి చేసుకుంటే.. రోజుకు 1 జీబీ 4జీ డేటా,.. అన్ లిమిటెడ్ కాల్స్ అందించనుంది. 70 రోజుల కాలపరిమితితో ఈ ఆఫర్‌ను పొందవచ్చని.. వీటితో పాటు 4జీ సిమ్ కార్డును కూడా అందించనుందని తెలిపారు.

