సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో ‘రోబో’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం ‘2.0’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక భయంకరమైన విలన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అయ్యి ఉండి ఈ చిత్రంలో విలన్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాడు. అది కూడా ఒక భయంకరమైన పాత్రలో, భారీ మేకప్‌తో నటించేందుకు అక్షయ్ కుమార్ ఒప్పుకోవడం వెనుక భారీ ఖరీదైన కారణం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్‌కు ఈ చిత్రం కోసం ఏకంగా రోజుకు రెండు కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒక స్టార్ హీరో విలన్‌గా నటించడం అంటే మామూలు విషయం కాదు. అందుకు భారీ పారితోషికం ఇవ్వడం వల్లే అక్షయ్ కుమార్ ఒప్పుకున్నాడు అని అంతా అనుకుంటున్నారు. అయితే రోజుకు రెండు కోట్ల భారీ పారితోషకం అని ఏ ఒక్కరు ఊహించి ఉండరు. మొత్తంగా అక్షయ్ కుమార్‌కు ఈ చిత్రంతో ఎన్ని కోట్లు ముడుతాయో అంటూ ప్రచారం జరుగుతుంది.


