అయితే జియో ప్రకటనలో ఇది వరకే ‘సమ్మర్ సర్‌ప్రైజ్’ రీచార్జ్ చేసుకున్నవారికి మాత్రం ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. మార్చి 31లోపు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలని యూజర్లకు గతంలో జియో తెలుపగా, మెంబర్‌షిప్ తీసుకుంటేనే జియో అందిస్తున్న సదుపాయాలు వర్తిస్తాయని పేర్కొంది.
కాని మార్చి 31న జియో వెబ్‌సైట్, యాప్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందలేకపోయారు. ఆ తరవాత 15రోజులపాటు పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించిది.

