నేచురల్‌ స్టార్‌ నాని సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం


ఏ మాత్రం సినిమా బ్యాగ్రౌండ్‌ లేకుండా స్వీయ ప్రతిభతో స్టార్‌ హీరోగా ఎదిగాడు నేచురల్‌ స్టార్‌ నాని. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. ‘నేను లోకల్‌’ తర్వాత తన పారితోషికాన్ని స్వల్పంగా పెంచాడట. ఈ సినిమాకు ముందు నాని పారితోషికం మూడు కోట్ల రూపాయలట.

‘నేను లోకల్‌’ తర్వాత నాని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. నాని ఇమేజ్‌, మార్కెట్‌ దృష్ట్యా ఈ రేంజ్‌ రెమ్యునరేషన్‌ సమంజసమే. ఈ లెక్కన ఈ ఏడాది నాని సంపాదన 15 కోట్ల రూపాయలట. నాని ఈ ఏడాది దాదాపు మూడు సినిమాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘నిన్ను కోరి’ అనే సినిమాలో చేస్తున్నాడు నాని. ఆ తర్వాత దిల్‌ రాజు సినిమా అంగీకరించాడు. అది పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు.


 ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే తెరకెక్కనున్నాయి. ఆ తర్వాత ‘బాహుబలి’ నిర్మాతల బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడట నాని. ఆ సినిమాకుగానూ నానికి భారీ పారితోషికం దక్కబోతునట్టు సమాచారం. ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ వేడుకలో నాని కనిపించడానికి అది కూడా ఓ కారణం అంటున్నారు సినీజనాలు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top